గత వారం రోజులుగా హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ తమిళంలో చేయబోతున్న చిత్రంలో బోల్డ్ గా నటించబోతున్నట్టుగా వార్తలు రావడమే కాదు.. సిల్క్ స్మిత బయోపిక్ లో అనసూయ అంటూ ప్రచారం జరుగుతుంది. అంతలా సోషల్ మీడియాలో అనసూయ సిల్క్ స్మిత పాత్రపై ప్రచారం జరగడానికి కారణం అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫొటోస్. ఒకసారి విజయ్ సేతుపతితో కలిసున్న ఫోటో పోస్ట్ చేసిన అనసూయ, తర్వాత కాళ్ళకి గజ్జలు, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో కాస్త సిల్క్ స్మితని పోలి ఉన్న లుక్ ఫోటో పోస్ట్ చెయ్యడంతో అనసూయ కోలీవుడ్ లో సిల్క్ స్మిత పాత్రలో నటిస్తుందని ఫిక్స్ అయ్యారు.
కానీ తాజాగా అనసూయ మాత్రం నేనా సిల్క్ స్మిత బయోపిక్ లోనా.. మీకేమన్నా పిచ్చా అంటూ క్లారిటీ ఇచ్చేసింది. నేను ఏ బయోపిక్ లోను.. అలాగే సిల్క్ స్మిత బయోపిక్ లో అస్సలు నటించడం లేదు. ఓ కోలీవుడ్ మూవీ లో మాత్రం నటిస్తున్నా అంటూ తనపై వస్తున్న సిల్క్ స్మిత బయోపిక్ న్యూస్ కి ఎండ్ కార్డు వేసింది. మరి కోలీవుడ్ లో అనసూయ సిల్క్ స్మితగా నటించి అదరగొట్టేస్తుంది.. ఈ ఒక్క సినిమాతో కోలీవుడ్ లో ఈ హాట్ యాంకర్ జెండా పాతడం పక్కా అనుకున్నారు.