మహేష్ బాబు కి డబ్బు లెక్కలేదు. చేతి నిండా బోలెడంత డబ్బు.. ఒకపక్క యాడ్ షూట్స్, మరోపక్క సినిమాలు, ఇంకోపక్క మహేష్ బిజినెస్ లు. అలాంటి మహేష్ డబ్బుకి పడి చచ్చిపోవడం ఏమిటా అనుకుంటున్నారా.. మహేష్ - పరశురామ్ కాంబోలో తెరకెక్కబోతున్న సర్కారు వారి పాటలో మహేష్ రూపాయితోనే డబ్బు సంపాదించాలనే కసితో ఉంటాడట. మరి పరశురామ్ మహేష్ సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ లోనే రూపాయి, డాలర్, మహేష్ రఫ్ లుక్ చూపించి కథపై క్లారిటీ ఇచ్చేసాడు. అందులోను సర్కారు వారి పాట బ్యాంక్స్ చుట్టూ తిరిగే కథ. బ్యాంకు లకు డబ్బు ఎగ్గొట్టి పారిపోయిన బడా బాబుల పని పెట్టె కేరెక్టర్ లో మహేష్ కనిపిస్తున్నాడు.
అయితే తాజాగా ఈ కథలో హీరో డబ్బు విలువ బాగా తెలిసినాడు కావడంతో ప్రతి రూపాయి లెక్కే, ఆ రూపాయితోనే హీరో జీవితం మొదలు కావడంతో ఆ రూపాయితో కోట్లు సంపాదించాలనే కసితో హీరో పెరిగి పెద్దవాడవుతాడట. అది కూడా పద్దతిగా న్యాయంగా సంపాదించాలనే కసితో హీరో తిరిగుంటాడట. అందులో భాగంగానే బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టిన బడా బాబుల పని పడతాడట హీరో. ఇది సర్కారు వారి పాట స్టోరీ అంటున్నారు. సినిమా మొత్తం డబ్బు, రూపాయి చుట్టూనే తిరుగుతుందట. సో మహేష్ ఆ డబ్బు ఎలా సంపాదించాడో అనేది పరశురామ్ ఎంటెర్టైమెంట్ తో కలిపి చూపించబోతున్నాడట.