Advertisementt

రెండు బ్రేకప్స్ ఎలా తట్టుకుంటావ్ విశాల్!

Wed 09th Dec 2020 06:12 PM
vishal,varalakshmi sarat kumar,anisha reddy,engagement breakup  రెండు బ్రేకప్స్ ఎలా తట్టుకుంటావ్ విశాల్!
How did you withstand two breakups Vishal?!? రెండు బ్రేకప్స్ ఎలా తట్టుకుంటావ్ విశాల్!
Advertisement
Ads by CJ

తమిళనాట హీరో విశాల్ టాప్ హీరోనే. ఎప్పుడు వివాదాల్లో నానే విశాల్ కి వయసైపోతుంది.. అయినా పెళ్లి మాటెత్తడు. గత ఏడాది అనీషా రెడ్డి తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడది కూడా బ్రేకప్ అయినట్లుగా తెలుస్తుంది. గతంలో వరలక్ష్మి శరత్ కుమార్ తో లవ్ స్టోరీ నడిపిన విశాల్.. చాలా రోజులు ప్రేమించుకున్నారు. తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారనుకున్నారు. తర్వాత వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ తో విశాల్ యుద్ధం నడిపాడు. ఒకపుడు కోలీవుడ్ లో విశాల్ vs శరత్ కుమార్ అన్న రేంజ్ లో గొడవలు జరిగాయి. నడిఘర్ సంఘం ఎన్నికల్లో విశాల్ గెలిచిన తర్వాత శరత్ కుమార్ - రాధికలు విశాల్ మీద చాలా రోజులు యుద్ధం చేసారు. తర్వాత విశాల్ - వరలక్ష్మి లు నడిఘర్ సంఘంలో కొత్తగా కట్టిన కల్యాణమండపంలో పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ నడిచింది. ఆ తర్వాత ఏమైందో ఏమో వరలక్ష్మికి విశాల్ కి బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత ఎవరి కెరీర్ లో వారు బిజీ అయ్యారు. 

ఇక విషయం వరలక్ష్మి తో బ్రేకప్ అయ్యాక కొన్నాళ్ళకి అనీషా రెడ్డి ని ప్రేమించి నిశ్చితార్ధం కూడా చేసుకున్నాడు విశాల్. అయితే గత ఏడాది విశాల్ నిశ్చితార్ధం ముచ్చట సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కానీ అప్పటినుండి విశాల్ సినిమాలతో బాగా బిజీగా ఉంటున్నాడు కానీ.. పెళ్లి ఊసెత్తడం లేదు. మధ్యలో అనీషా రెడ్డి తో విశాల్ బ్రేకప్ అనే వార్తలు వచ్చినా అటు విశాల్ కానీ, ఇటు అనీషా కానీ తమ బ్రేకప్ పై స్పందించలేదు. అయితే తాజాగా అనీషా, విశాల్ తో బ్రేకప్ అయ్యాక ఓ బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి విశాల్ కి రెండు బ్రేకప్స్. ఒకటి వరలక్ష్మితో.. రెండోది అనీషా రెడ్డితో. పాపం విశాల్ రెండు బ్రేకప్స్ ని ఎలా తట్టుకున్నాడో అంటున్నారు విశాల్ అభిమానులు.

How did you withstand two breakups Vishal?!?:

The latest reports reveal that Vishal and Anisha have called off their wedding.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ