బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ సింహ, లెజెండ్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ కోట్టేసరికి BB3 పై భారీ అంచనాలు మొదలయ్యాయి. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య ని పవర్ ఫుల్ గా చూపించబోతున్నాడని BB3 టీజర్ ద్వారానే అర్ధమైంది. అయితే తర్వాత BB3 పై సోషల్ మీడియాలో పెద్దగా కనిపించడం లేదు. కారణం ఏమిటంటే ఒకటి కాదు.. రెండు ఉన్నాయి. అందులో మొదటిది బాలయ్య పక్కన నటించే హీరోయిన్స్ విషయంలో ఏదో జరగడం. ముందు నుండి బాలయ్య పక్కన నటించబోయే భామా విషయంలో కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ.. బోయపాటి తో బాలయ్య అనగానే హీరోయిన్స్ ప్రాబ్లెమ్ వచ్చేది కాదు. కానీ BB3 కి ఇప్పుడు హీరోయిన్స్ ప్రాబ్లెమ్ బాగా వచ్చింది. ముంబై మోడల్ అన్నారు. తర్వాత సయ్యేషాకి స్వాగతం పలికారు, తర్వాత ప్రగ్య జైస్వాల్ అంటూ ప్రచారం జరుగుతుంది కానీ.. చిత్ర బృందం ప్రకటన ఇవ్వలేదు.
మరోపక్క బోయపాటి విలన్ విషయంలో ఇంకా ఆలోచిస్తున్నాడనే టాక్. నవీన్ చంద్ర ఒక విలన్ గా కనిపిస్తాడన్నారు. మరి బాలయ్యని ఢీ కొట్టబోయే భారీ విలన్ కావాలి. ఇంతవరకు ఆ హీరో పేరు ఈ హీరో వినిపించడం తప్ప కంఫార్మేషన్ లేదు. మరోపక్క BB3 కి మోనార్క్ టైటిల్ వాడుకలో ఉన్నా బోయపాటి క్లారిటి ఇవ్వడం లేదు. అసలు బోయపాటి BB3 అప్ డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ చేసుకుంటున్నాడు. బాలయ్య అటు బసవతారకం హాస్పిటల్ పనులు అలాగే అన్న కొడుకు నిశ్చితార్థంలో బిజీ. మరి షూటింగ్ విషయం మాట్లాడాడు. బాలయ్య ఫాన్స్ BB3 అప్ డేట్స్ కోసం వెయిటింగ్. ఇప్పుడు BB3 విషయమేమైనా సోషల్ మీడియాలో చూసినా ప్రేక్షకులు పెద్దగా ఎగ్జైట్ అవ్వడం లేదు.