బిగ్ బాస్ మరో రెండు వారాల్లో ముగియ బోతుంది. బిగ్ బాస్ లో కేవలం ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఈ వారం నామినేషన్స్ లో బిగ్ బాస్ డైరెక్ట్ గా ఐదుగురిని నామినేట్ చేసారు. అఖిల్ టికెట్ టు ఫినాలే తో డైరెక్ట్ గా టాప్ 5 కి వెళ్ళిపోయాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 4 మొదలైనప్పటినుండి స్టిల్ ఇప్పటివరకు అభిజిత్ నామినేట్ అవుతూ ఎలిమినేషన్స్ లోకి వస్తున్నాడు. సీజన్ మొత్తం మీద ఒకే ఒక్కసారి మాత్రమే అభిజిత్ నామినేట్ అవలేదు. మిగతా అన్ని వారాలు నామినేట్ అయ్యాడు. ఇక మోనాల్ విషయంలో అఖిల్ తో గొడవ, మాస్ - క్లాస్ అంటూ సోహైల్ తో గొడవ, కామెడీ విషయంలో అవినాష్ తో గొడవ అలా హైలెట్ అయిన అభిజిత్ టాస్క్ ల పరంగా తేలిపోయాడు. మొన్నటివరకు టైటిల్ ఫెవరెట్ గా ఉన్న అభిజిత్ గ్రాఫ్ పడిపోయింది. గత రెండు వారాలుగా అభిజిత్ బాగా డల్ అయ్యాడు. మోనాల్ విషయంలో అభిజిత్ తప్పు చేసాడని నాగ్ మందలించినప్పటినుండి అభిజిత్ లో మార్పు కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది.
మరో రెండు వారాల్లో ముగియబోతున్న బిగ్ బాస్ టాప్ 5 లో అభిజిత్ ఉంటాడు.. బట్ టైటిల్ గెలవడం కష్టమంటున్నారు. సోహైల్ - అఖిల్ ఇద్దరిలో టాప్ 2, అలాగే వాళ్ళిద్దరితో ఎవరో ఒకరు టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినబడుతుంది. మరి అభిజిత్ యాక్టీవ్ గా ఉండకుండా గమ్మున కూర్చుంటే కష్టం. ఈ రెండు వారాల్లో అభిజిత్ నిరూపించుకుంటే టైటిల్ విన్నింగ్ దగ్గరలో ఉంటాడు లేదంటే కష్టం అంటున్నారు సోషల్ మీడియా ఫాన్స్. మరి ఇప్పటికే సీజన్ వరెస్ట్ పెరఫార్మెర్ గా జైలుకి వెళ్లిన అభిజిత్ ఇప్పుడైనా టాస్క్ లలో యాక్టీవ్ గ ఉంటే బావుంటుంది. లేదంటే అభిజిత్ టాప్ 2 కి కూడా వెళ్ళడు.