Advertisementt

కెవ్వు కార్తీక్ పై కిడ్నాప్ కేసు.. కార్తీక్ వివరణ!

Tue 08th Dec 2020 01:46 PM
kevvu karthik,brother-in-law,ravi kumar,kidnap case  కెవ్వు కార్తీక్ పై కిడ్నాప్ కేసు.. కార్తీక్ వివరణ!
Kidnap case filed against Kevvu Karthik.. Karthik's explanation! కెవ్వు కార్తీక్ పై కిడ్నాప్ కేసు.. కార్తీక్ వివరణ!
Advertisement
Ads by CJ

జబర్దస్త్ లో మాస్ అవినాష్ - కెవ్వు కార్తీక్ జంట అంటే తెలియని వారుండరు. అవినాష్ జబర్దస్త్ ని వదిలి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాక కెవ్వు కార్తీక్ సింగిల్ హ్యాండ్ తో స్కిట్స్ కొడుతున్నాడు. అయితే కామెడీ చేసి నవ్విస్తున్న కెవ్వు కార్తీక్ పై పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్ కేసు నమోదుకావడం కామెడీ ప్రియులకి షాకిచ్చింది. జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ అంటే వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి  వివాదానికి కేరాఫ్ అడ్రెస్స్ గా మారడం కామెడీ ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకీ కెవ్వు కార్తీక్ పై పోలీస్ లు కిడ్నాప్ కేసుపెట్టడానికి కారణం. కార్తీక్ అక్క భర్త రవి కుమార్.

కార్తీక్ అక్క భర్త రవి కుమార్ ని కార్తీక్ మరియు అతని ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లి కిడ్నాప్ చేసి.. కారులో 15 కిలోమీటర్లు తీసుకెళ్లి దాడి చేసినట్లుగా రవి కుమార్ పోలీస్ లకు ఫిర్యాదు చెయ్యడంతో కార్తీక్ పై పోలీస్ కేసు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు. కార్తీక్ వెంట ఐదుగురు స్నేహితులు వచ్చి తనను కిడ్నాప్ చేసినట్లు రవి కుమార్ తన ఫిర్యాదులో పేర్కొనడంతో.. పోలీసులు వివిధ సెక్షన్స్ కింద కార్తీక్ పై కేసు నమోదు చేసారు. కార్తీక్ మాత్రమే కాదు.. అతని తల్లిపై కూడా రవి కుమార్ కేసు పెట్టడం సంచంలనంగా మరింది.

కానీ కెవ్వు కార్తీక్ మాత్రం తనపై తప్పుడు కేసు పెట్టారని, 18 సంవత్సరాలుగా తన బావ తన ఫ్యామిలీని వేధిస్తున్నాడని, తన పేరుని దిగజార్చడానికే అతను ఇలా కేసు పెట్టాడని, విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయంటున్నాడు. అంతేకాదు క్యాన్సర్ బారిన పడిన తన తల్లిపై కూడా కేసు పెట్టడం బాధకారమంటున్నాడు కార్తీక్.

Kidnap case filed against Kevvu Karthik.. Karthik's explanation!:

Kevvu Karthik brother-in-law Ravi booked a case on him

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ