ఆదిపురుష్ సినిమా పురాణం గాధ రామాయణం ఆధారంగా తెరకెక్కుతుంది అనగానే ఆదిపురుష్ చుట్టూ వివాదాలు అలుముకోవడం ఖాయమనుకున్నారు. అనుకున్నట్టుగానే సైఫ్ అలీ ఖాన్ తన విలన్ పాత్ర రావణ్ గురించి, సీత అపహరణం గురించి మాట్లాడాడో లేదో.. బిజెపి నేతలు ఆదిపురుష్ సినిమాపై విరుచుకుపడిపోతున్నారు. ఎట్టకేలకు సైఫ్ అలీ ఖాన్ దిగొచ్చి క్షమాపణలు కూడా చెప్పాడు. తాను అన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా చెప్పడంతో వివాదం ముగిసిందని అనుకోవాలి. కానీ ఆదిపురుష్ పై తర్వాత తర్వాత ఇంకెన్ని వివాదాలు మొదలవుతాయో.. సినిమాని ఓం రౌత్ చరిత్ర ని వక్రీకరించకుండా తెరకెక్కించితే ఓకె.. లేదంటే చిన్న దాన్ని అయినా పెద్దది చేసి గోల చెయ్యడం విమర్శుకులకున్న అలవాటు.
సైఫ్ అలీ ఖాన్ చెప్పినట్టుగా రావణ్ పాత్రని కాస్త పాజిటివ్ గా చూపించినా వివాదం మళ్ళీ లేస్తుంది. ఓం రౌత్ ఎంత బాగా హ్యాండిల్ చేసినా.. ఏక్కడో అక్కడ పొరబాటు జరగకుండా ఉండదు. మరి సినిమా మొదలు కాకుండానే ఇంతటి వివాదాన్ని మూటగట్టుకుంటున్న ఆదిపురుష్ కే ముందు ముందు తలెత్తే వివాదాలతో ఇంకెంత టెంక్షన్ పడాల్సి వస్తుందో. చిన్న వివాదం కాబట్టి సైఫ్ అలీ ఖాన్ ముందుకొచ్చి క్షమాపణలు చెప్పబట్టి సరిపోయింది లేదంటే బీజేపీ నేతలు, హిందూ సంఘాలు కలిసి రోడ్డెక్కి ధర్నాలు చేసేవి. మరి ఇంతటి సున్నితమైన రామాయణం ని ఆదిపురుష్ తన స్టయిల్ లో ఎలా చూపించబోతున్నాడో అనే క్యూరియాసిటీ అంతకంతకు పెరిగిపోతుంది.