గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటినుండి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడు. సీఎం గా అధికారిక మీటింగ్స్ కి హాజరవుతూ మంత్రులకి డైరెక్షన్స్ ఇస్తూ.. అధికారం కొడుకు కేటీఆర్ చేతికి ఇవ్వకపోయినా.. అంతా కొడుకు చేతిలో పెట్టి రెస్ట్ తీసుకుంటున్నాడు కేసీఆర్. కేటీఆర్ టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా టీఆరెస్ పార్టీ బాధ్యతలను మోస్తున్నాడు. ఇక ఎక్కడైనా ఎన్నికలు జరిగితే కేటీఆర్ ప్రచారంలో పాల్గొంటూ రోడ్ షోస్ అవి చేస్తున్నాడు. కానీ కేసీఆర్ అయితే భారీ బహిరంగ సభకి హాజరై.. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళని, బిజెపి వాళ్ళని చవట దద్దమ్మలు అంటూ తిట్టేసి ఫామ్ హౌస్ కి వెళ్ళిపోతాడు.
కానీ దుబ్బాక ఉపఎన్నిక దగ్గరనుండి టీఆరెస్ కి ఎదురు గాలి వీచడంతో వాళ్లలో దడ మొదలయ్యింది. బిజెపి టీఆర్ఎస్ కి స్పాట్ పెట్టింది. దుబ్బాకలోనే కాదు గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి కి టీఆర్ఎస్ అడ్డంగా దొరికేసింది. మాకు ఇప్పటివరకు తెలంగాణాలో ఎదురు లేదు అనుకుంటున్న కేసీఆర్ కి బిజెపి చమటలు పట్టించింది. గ్రేటర్ లో బిజెపి బలంగా జెండా పాతడంతో ఇప్పుడు టీఆర్ఎస్ మంత్రులు, కార్యకర్తలు అంతా కేసీఆర్ సారు ఫామ్ హౌస్ నుండి బయటికొచ్చి రాజకీయాలు చూడండి అంటూ విన్నపాలు చేసుకుంటున్నారట. ఇక వాస్తు పిచ్చితో నూతన సచివాలయాన్ని నిర్మించడంలో ఉన్న ఉత్సాహం ప్రజల బాగోగులపై పెడితే.. పార్టీకి మేలు జరుగుతుంది అంటున్నారట పార్టీ కార్యకర్తలు. మరి హైదరాబాద్ వరదల విషయంలో టీఆరెస్ పార్టీకి చెడే జరిగింది. ముంపు కాలనీలకు ఇంటికి 10 వేలు చొప్పున ఇచ్చిన టైం లోనూ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. దాని వలనే టీఆర్ఎస్ కి గ్రేటర్ ఎన్నికల్లో తక్కువ సీట్లు రావడానికి మెయిన్ కారణం. మరి కేసీఆర్ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ పరిస్థితులు అర్ధం చేసుకుని ఫామ్ హౌస్ ని వదులుతాడో లేదో చూద్దాం.