ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ఆదిపురుష్ చిత్రం అప్పుడే వివాదాల్లో చిక్కుకుంది. ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ లంకేశ్ అంటే విలన్ గా తెరకెకనున్న ఈ సినిమా జనవరి నుండి సెట్స్ మీదకి వెళ్లనుంది. అయితే తాజాగా ఈ సినిమా విలన్ లంకేశ్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ తనపాత్రని రివీల్ చేస్తూ రావణుడిని మానవత్వ కోణంలో చూపించబోతున్నట్లుగా.. సీతని అపహరించి.. రాముడిపై యుద్ధం చెయ్యాల్సిన పరిస్థితులను, రావణ్ పాత్రని మానవత్వ కోణంలో చూపించబోతున్నట్టుగా రివీల్ చేసేసాడు. దానితో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ బిజెపి నేత రామ్ కదం ట్వీట్ చేయడం, ఆయనతో పాటుగా మరికొంతమందికి సైఫ్ అలీఖాన్ మాటలు షాక్ కి గురి చేశాయంటూ.. రావణుడిని వెండితెరపై మంచివాడిగా చూపిస్తే ఊరుకోమంటూ హెచ్చరించడంతో సైఫ్ అలీఖాన్ దారికొచ్చాడు.
తాను ఇతరుల మనోభావాలను దెబ్బతీయాలని అలా మాట్లాడలేదని, నేను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటల వలన కొంతమంది మనోభావాలు దెబ్బతిని వివాదాలకు దారి తీశాయని తెలిసింది. మూవీ యూనిట్ చరిత్రని వక్రీకరించకుండా, వాస్తవ కథను పక్కకుపోకుండా సినిమాని తెరకెక్కించడానికి చాలా కష్టపడుతుంది. నా మాటలు తప్పుగా అనిపిస్తే క్షమిచండి.. నా మాటలను వెనక్కి తీసుకుంటున్నా, రాముడి వీరత్వానికి, ధర్మానికి చిహ్నంగా నేను భావిస్తాను. చెడుపై మంచి సాధించిన విజయం చుట్టూనే ఆదిపురుష్ కథ ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు అంటూ ఆదిపురుష్ పై తాను మాట్లాడిన మాటలకు సైఫ్ అలీ ఖాన్ ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పాడు.