ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి మోనాల్ ఎలిమినేట్ అయినట్లుగా వార్తలు రావడం అది కాస్త.. సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఎప్పటిలాగే బిగ్ బాస్ లీకులు షురూ అని అనుకున్నారు. ఎప్పటినుండో ఎలిమినేషన్ తప్పించుకుంటున్న మోనాల్ ఈసారి ఎలిమినేట్ అయ్యింది అనగానే.. బుల్లితెర ప్రేక్షకులు రిలీఫ్ ఫీల్ అయ్యారు. కారణం హౌస్ లో మోనాల్ ని చూడలేక బుల్లితెర ప్రేక్షకులు చచ్చిపోతున్నారు. ఆమె గ్లామర్ షో తప్ప హౌస్ కి పనికిరాని కంటెస్టెంట్స్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ఈ వారం మోనాల్ ఎలిమినేట్ అవ్వకపోతే మరి ఎవరు ఎలిమినేట్ అయ్యారనుకుంటున్నారు.
గత వారం ఎవిక్షన్ కార్డు వాడుకుని సేవ్ అయ్యి మరో వారం హౌస్ లో ఉన్న అవినాష్ ఈ వారం ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాడు. అవినాష్ కామెడీ చేస్తూ హౌస్ లో బాగానే ఎంటర్టైన్ చేసాడు. కానీ నోయెల్ బయటికి వస్తూ వస్తూ.. అవినాష్ కామెడీ చిల్లర కామెడీ అనడంతో అవినాష్ లో ఇన్సెక్యూర్ మొదలై.. కామెడీ చెయ్యడం మానేసి రాజకీయాలు మొదలు పెట్టాడు. ఇక ప్రేక్షకులు తనని బయటికి పంపడం ఖాయమని గత వారం ఫిక్స్ అయినా అవినాష్ మోనాల్ ని బ్యాడ్ చేయబోయి ప్రేక్షకులకి దొరికిపోయాడు.. మోనాల్ కాలితో తన్నింది అంటూ సింపతీ క్రియేట్ చేసుకున్న అవినాష్ ని ప్రేక్షకులు ఎలిమినేట్ చేసిపడేసారు. సో ఈ వారం అవినాష్ హౌస్ నుండి బయటికి వచ్చేసాడన్నమాట.