బిగ్ బాస్ సీజన్ 4 మొదలైంది మొదలు వారినికొకరు చొప్పున షో నుండి ఎలిమినేట్ అవుతున్నారు. నోయెల్ ఆరోగ్య పరిస్థితి కారణంగా తనకి తానుగా బ్యాటికివెళ్ళగా.. అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అవ్వకుండా ఓ వారం సేవ్ అయ్యాడు. ఇక అవినాష్ కూడా గత వారం ఎవిక్షన్ కార్డు వాడుకుని ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నాడు. అయితే ఈవారం అవినాష్ తో పాటుగా మోనాల్, అఖిల్, అభిజిత్, హరికలు నామినేషన్స్ లో ఉన్నారు. అయితే అందరిలో అవినాష్ డేంజర్ జోన్ లో ఉన్నాడని.. ఎప్పటిలాగా మోనాల్ సేవ్ అవుతుంది అనే టాక్ నడిచింది.
కానీ తాజాగా ఈ వారం హౌస్ నుండి వెళ్లబోయేది మోనాల్ అంటున్నారు. మోనాల్ ఏడుపు, అఖిల్ తో లవ్ ట్రాక్, గ్లామర్ షో తప్ప ఆమె మరే విధంగానూ హౌస్ లో ఉండడానికి అర్హురాలు కాదు. ఆమె గ్లామర్ షో బిగ్ బాస్ కి హెల్ప్ అవడంతో ఆమెని నాలుగైదు వారలు కాపాడి.. ఆమె కన్నా బలమైన కంటెస్టెంట్స్ ని హౌస్ నుండి బయటికి పంపారు బిగ్ బాస్ వాళ్ళు. దానితో బిగ్ బాస్ పై ట్రోలింగ్ మొదలయ్యింది. అయితే ఈ వారం అవినాష్ - మోనాల్ లు కి తక్కువ ఓట్స్ వస్తున్న కారణంగా ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారంటుంటే.. తాజాగా ఈ వారం మోనాల్ ఎలిమినేట్ కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో బిగ్ బాస్ లీకులు మొదలయ్యాయి. మరి ఎప్పుడో హౌస్ నుండి బయటకి వెళ్లాల్సిన మోనాల్ ఇప్పుడు ఈ వారం బయటికొచ్చేస్తుందన్నమాట. అన్నట్టు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ ని సపోర్ట్ చేసే కంటెస్టెంట్స్ ఎవరూ కనిపించడం లేదు. ప్రస్తుతం ఆ ఫ్రస్టేషన్ లో ఉన్న మోనాల్ కి ఇప్పుడు ఎలిమినేషన్ మరింత బాధని ఇవ్వబోతుంది.