పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమా చేస్తున్నాడు. లాక్ డౌన్ కి ముందే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఫైటర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇంకా మొదలు కాలేదు. భారీ బడ్జెట్ మూవీస్, ఫ్యాన్ ఇండియా మూవీస్ అన్ని సెట్స్ మీద కళకళలాడుతుంటే విజయ్ దేవరకొండ మాత్రం ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. అయితే ఫైటర్ షూటింగ్ మొదలు కావాలంటే విదేశీ ఫైటర్స్ భారీ సంఖ్యలో ఇండియాకి రావాల్సి ఉంది. అందుకే డిసెంబర్ మొదటి వారం నుండి ఫైటర్ షూటింగ్ మొదలు పెడదామనుకుంటే.. ఇప్పడు అది మరింత ఆలస్యమయ్యేలా ఉంది అంటున్నారు.
కారణం ఆ విదేశీ ఫైటర్స్ రాక మరింత ఆలస్యమవడమేనట. ఈ వారంలో మొదలు కావల్సిన షూటింగ్ ని జనవరి మూడో వారం అంటే సంక్రాతి వెళ్లిన తర్వాత మొదలు పెట్టాలని పూరి అండ్ బ్యాచ్ డిసైడ్ అయ్యిందట. మరి షూటింగ్ మొదలు పెట్టగానే.. విదేశీ ఫైటర్స్ ఆధ్వర్యంలో ఫైటర్ కి సంబందించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించాల్సి రావడంతోనే పూరి మళ్ళీ ఫైటర్ షూటింగ్ ని పోస్ట్ పోన్ చేసినట్టుగా ఫిలింనగర్ టాక్. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కరణ్ జోహార్ కూడా ఒక నిర్మాత కావడంతో ఈ సినిమాపై ఇండియా లెవల్లో భారీ అంచనాలే ఉన్నాయి.