Advertisementt

F3 లో రష్మిక?

Sat 05th Dec 2020 03:48 PM
rashmika mandanna,f3,item song,anil ravipudi  F3 లో రష్మిక?
Is Rashmika in F3? F3 లో రష్మిక?
Advertisement
Ads by CJ

ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఏకంగా మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ సినిమా చేసాడు. మహేష్ బాబు తో సెట్స్ మీదుండగానే అనిల్ రావిపూడితో ఎఫ్ 3 ఉండబోతుంది అంటూ దిల్ రాజు అనౌన్స్ చేసాడు. తాజాగా కరోనాకి వ్యాక్సిన్ వస్తుందో రాదో తెలియదు కానీ.. ఎఫ్ 3 తో నవ్వుల కామెడీ వ్యాక్సిన్ వచ్చేస్తుంది అంటూ అనిల్ రావిపూడి అధికారికంగా ఎఫ్ 3 స్క్రిప్ట్ లోకి దిగిపోయాడు. వెంకటేష్ - వరుణ్ తేజ హీరోలు గా ఎఫ్ 3 ని అనౌన్స్ చేసారు. మరి ఎఫ్ 3 లో మరో హీరో కూడా ఉండబోతున్నాడని, అది రవితేజ చేసే ఛాన్స్ ఉందని టాక్.

ఇక హీరోయిన్స్ గా తమన్నా, మెహ్రీన్ కౌర్ లే ఎఫ్ 3 లో నటించబోతున్నారని చెప్పిన అనిల్ రావిపూడి ఇప్పుడు ఎఫ్ 3 కోసం రష్మికాని దింపబోతున్నాడనే టాక్ నడుస్తుంది. అంటే హీరోయిన్ గా కాదు.. ఐటెం సాంగ్ కోసం రశ్మికాని అనిల్ ఫిక్స్ చేయబోతున్నాడనే టాక్ నడుస్తుంది. మరి సుప్రీం హీరోయిన్ రాశి ఖన్నాతో అనిల్ రావిపూడి రవితేజ రాజా ధీ గ్రేట్ లో స్పెషల్ ఐటెం చేయించడం, ఎఫ్ 2 హీరోయిన్ తమన్నాని సరిలేరు నీకెవ్వరులో స్పెషల్ సాంగ్ చేయిస్తే.. ఆ సాంగ్ కి బాగా పేరు రావడంతో అనిల్ రావిపూడి ఇప్పుడు సరిలేరు నీకెవ్వరూ హీరోయిన్ రశ్మికాని ఎఫ్ 3 స్పెషల్ సాంగ్ కోసం తేబోతున్నాడని.. సెంటిమెంట్ ప్రకారం అనిల్ ఈ పని చేయబోతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. ఇక అనిల్ తో ఉన్న అనుబంధం తో రష్మిక ఆ సాంగ్ చెయ్యొచ్చనే ఊహాగానాలు బయలుదేరాయి.

Is Rashmika in F3?:

Rashmika to do a item song in F3

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ