Advertisementt

వర్షంలోనూ వెనక్కి తగ్గని జనసేనాని..!

Sat 05th Dec 2020 02:37 PM
pawan kalyan,chittoor,poya village,farmers,janasena party  వర్షంలోనూ వెనక్కి తగ్గని జనసేనాని..!
Janasena, who did not back down even in the rain ..! వర్షంలోనూ వెనక్కి తగ్గని జనసేనాని..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలంటూ రెండు పడవల మీద కాళ్ళేసుకుని ప్రయాణం చేస్తున్నాడు. రాజకీయాలకి, సినిమాలకి టైం కెటాయిస్తున్న పవన్ అన్న కూతురు నిహారిక పెళ్లి కోసం రాజస్థాన్ పయనమవ్వాల్సి ఉంది. అయితే తాజాగా ఏపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ సీఎం పదవి అంటే అలంకారం కాదు.. అధికారం అని కొందరు అనుకుంటారని, కానీ అది బాధ్యతతో కూడుకున్న పదవి అని.. చిరంజీవి గారు సీఎం అవ్వాలంటే అయ్యేవారే కానీ.. ఆయన ప్రజలకు సేవ చెయ్యాలనుకున్నారంటూ సంచలనంగా మాట్లాడిన పవన్ తాజాగా తుపాను ప్రభావిత చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.

వరదలకు మునిగిపోయిన పంట పొలాలను పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్ వర్షాన్ని సైతం లెక్క చెయ్యకుండా గొడుకు పట్టుకుని మరీ అక్కడి రైతులను పరామర్శించాడు. పోయ గ్రామంలోకి తనని తమ పార్టీ నాయకులని రానివ్వకుండా అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది అంటూ పవన్ ఆగ్రహంతో ఊగిపోయాడు. తాను బెదిరింపులకు భయపడే వ్యక్తిని కానని... జనసేన కార్యకర్తలపై దాడులు చేస్తే ప్రతిచర్యలు అంతకంటే తీవ్రంగా ఉంటాయని పవన్ ఆవేశంతో వార్నింగ్ ఇచ్చాడు. తమపై దాడి చేసిన వారిపై తమకి దాడి చెయ్యగల సత్తా ఉంది అంటూ పవన్ హెచ్చరించాడు. ప్రస్తుతం పవన్ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రైతులతో మమేకం అవడం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 

Janasena, who did not back down even in the rain ..!:

Pawan grabbed and  umbrella without even counting the rain and consoled the farmers there..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ