ప్రభాస్ వరస సినిమాల లిస్ట్ చూస్తుంటే బాలీవుడ్ హీరోలకి దడ పుట్టేలా ఉంది. రాధేశ్యాం సెట్స్ మీదుండగానే.. నాగ్ అశ్విన్ తో, ఆదిపురుష్ ఓం రౌత్ తోనూ తాజాగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సాలార్ మూవీని లైన్ లో పెట్టి అందరికి షాకిచ్చాడు ప్రభాస్. ఎప్పడు ఏ సినిమా మొదలు పెట్టినా ప్రభాస్ ఫాన్స్ కి హ్యాపీనే. కానీ హీరోయిన్స్ విషయానికొచ్చేసరికి ప్రభాస్ తో పనిచేసే దర్శకులకి పెద్ద పరీక్షల మారింది. నాగ్ అశ్విన్ ముందు మేలుకుని బాలీవుడ్ టాప్ గర్ల్ దీపికా పదుకొనేని తెచ్చేసుకున్నాడు. కానీ ఆదిపురుష్ లో ప్రభాస్ హీరోయిన్ కోసం ఓం రౌత్ కష్టాలు మాములుగా లేవు.. ఏదో కృతి సనన్ పేరు వినిపిస్తున్నా.. దానికి ఫాన్స్ ఒప్పుకోవడం లేదు.
ఇక తాజాగా ప్రశాంత్ నీల్ సాలార్ లో ప్రభాస్ కోసం ఎలాంటి, ఏ హీరోయిన్ ని తీసుకురాబోతున్నాడో అనే క్యూరియాసిటీ ఇప్పుడు అందరిలో మొదలయ్యింది. ప్రభాస్ పక్కన సరిపోయే అందమైన భామ కోసం ప్రశాంత్ నీల్ వేట ఉందట. అయితే తాజాగా రాధేశ్యాం చిత్రంలో ప్రభాస్ తో కలసి నటిస్తున్న పూజ హెగ్డే నే సలార్ లో కూడా హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని.. ఇప్పటికే పూజ హెగ్డే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తోనూ, రణ్వీర్ సింగ్ సినిమాల్లో నటిస్తుంది కాబట్టి.. మళ్ళీ ప్రశాంత్ నీల్ పూజానే రిపీట్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా మీడియా టాక్. మరి ప్రభాస్ తో మళ్ళీ పూజ మరోసారి ఫ్యాన్ ఇండియా మూవీలో నటించే ఛాన్స్ మాత్రం 100 కి 90 శాతం ఉందని అంటున్నారు.