కామెడీ షో జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వచ్చిన ముక్కు అవినాష్ కామెడీతోనే టైటిల్ విన్నర్ అవుదామనుకుని కలలు కన్నాడు. కామెడీ కామెడీ, నన్ను కామెడీ చేయడానికే ఈ షోకి పిలిచారు అంటూ అవినాష్ కామెడీ మీదే కూర్చున్నాడు. టాస్క్ ల విషయంలో బాగా పోరాడతాడు.. కానీ గెలవడు. ఆరియానాతో ఫ్రెండ్ షిప్ చేస్తాడు. కానీ సింపతీ వర్కౌట్ అయ్యేలా చూసుకుంటాడు. ఇక మొన్న ఆదివారం బిగ్ బాస్ ఎవిక్షన్ కార్డు వాడకపోతే ఎలిమినేట్ అయ్యేవాడే.. ఆ విషయాన్నీ అవినాష్ డైజెస్ట్ చేసుకోవడం లేదు. నేను కామెడీ చేసాడు, పోరాడాను.. వీక్ కంటెస్టెంట్స్ ఉన్న హౌస్ నుండి స్ట్రాంగ్ అయిన నన్నెలా పంపిస్తారు అంటూ అవినాష్ ఇప్పడు కామెడీ చెయ్యడం మానేసి బిగ్ బాస్ హౌస్ లో రాజకీయాలు మొదలు పెట్టాడు.
నేను కామెడి చేస్తే అది ప్రేక్షకులకి నచ్చడం లేదు.. వీక్ కంటెస్టెంట్స్ ఉన్న వారిని హౌస్ లో ఉంచి అన్నాను పంపాలకునుకుంటున్నారు అంటూ ఏడుస్తున్నాడు. ఇక అఖిల్ - సోహైల్ గేమ్ కలిసి ఆడుతున్నారంటూ గొడవ చేసిన అవినాష్ హారిక - అభిజిత్ కి సపోర్ట్ చేస్తూ రాజకీయాలు మాట్లాడుతున్నాడు. కామెడీ కామెడీ అనే అవినాష్ కాస్త ఇప్పుడు రాజకీయాలు చేస్తూ బిగ్ బాస్ రాజకీయనాయకుడిలా కనబడుతున్నాడు. అఖిల్- సోహైల్ విషయమే కాదు... మోనాల్ తనని తన్నింది అని, ఆమె అబద్దాలు చెబుతుంది అని సోహైల్ దగ్గర, అభిజిత్ హారిక దగ్గర మాట్లాడుతున్నాడు. మరోపక్క మోనాల్ నడగ్గాకొచ్చి ప్రేక్షకుల్లో నీకు సింపతీ లేదని చెప్పింది అంటూ చెబుతుంది అంటున్నాడు. అసలు అవినాష్ టికెట్ టు ఫినాలే టాస్క్ అంతా ఆడలేకపోవడమే అవినాష్ ఏడుపుకి మెయిన్ కారణంగా కనబడుతుంది.