అర్జున్ రెడ్డి సినిమా చూసాక హీరోయిన్స్ చాలామంది రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫాన్స్ అయ్యారు. విజయ్ అంటే క్రష్, విజయ్ దేవరకొండ తో సినిమాలు చెయ్యాలని బాలీవుడ్ భామలు కూడా అనుకున్నారు. ఆ అదృష్టం మాత్రం మొదటిసారిగా లేత అందాల అనన్య పాండే కి దక్కింది. అనన్య కూడా అదే చెబుతుంది. అర్జున్ రెడ్డి చూసాక విజయ్ దేవరకొండతో కలిసి పనిచేస్తే బావుంటుంది అనుకుంటే.. ఏకంగా విజయ్ పక్కన పాన్ ఇండియా మూవీ చేసే అవకాశం రావడం నిజంగా అదృష్టం అంటుంది. పూర్తి అండ్ ఛార్మిలతో కలిసి పని చేస్తుంటే.. కొత్తవాళ్లతో పని చేస్తున్న ఫీలింగ్ కలగలేదంటుంది. ఇక తాను సినిమాల్లోకి వచ్చి కొద్దికాలమే అయినా..తన కోసం ప్రాణమిచ్చే అభిమానులు చూస్తే హ్యాపీగా ఉంటుందట అనన్యకి.
అయితే తనకి చిన్నప్పటినుండి బాలీవుడ్ హీరో హ్రితిక్ రోషన్ అంటే చాలా ఇష్టం అంటుంది అనన్య. బహుశా నా వయసున్న అమ్మాయిలందరికి హ్రితిక్ అంటే ఇష్టం ఉండకుండా ఉండదు.. హృతిక్ అంటే యూనివర్సల్ క్రష్ ఏమో.. అంతబావుంటాడు హ్రితిక్ రోషన్. కానీ సినిమాల్లో నటించడానికి మాత్రం వరుణ్ ధావన్ పక్కన నటించడం అంటే ఇష్టమంటుంది ఈ చిన్నది. హృతిక్ ఇష్టమే కానీ.. సినిమాల్లో నటించడానికి కాదట.. సినిమాలంటే వరుణ్ ధవన్ పక్కనే అని తెగేసి చెబుతుంది అనన్య పాండే. ఇంకా ఫైటర్ నిర్మాత ఛార్మి గురించి మట్లాడుతూ ఛార్మి చాలా మంచిది అని.. నాకు కథ చెప్పడానికి వచ్చినపపుడు మీ చెవి రింగ్స్ బావున్నాయనగానే తన చెవుల రింగ్స్ తీసి నాకిచ్చేసిందింది అంత మంచిది ఛార్మి అంటూ అనన్య ఛార్మిని పొగిడేస్తోంది.