Advertisementt

విమర్శలకు బాధపడను అంటున్న రాజమౌళి సీత!

Fri 04th Dec 2020 06:24 PM
alia bhatt,rrr,sitha,netizens,social media  విమర్శలకు బాధపడను అంటున్న రాజమౌళి సీత!
Netizens cyber bullyed me a lot, but I've taken it enthusiastically.. says Alia విమర్శలకు బాధపడను అంటున్న రాజమౌళి సీత!
Advertisement
Ads by CJ

RRR లో అల్లూరి సీతారామరాజు పాత్ర లో కనిపించనున్న రామ్ చరణ్ కి రాజమౌళి బాలీవుడ్ నుండి సీత పాత్ర కోసం అలియా భట్ ని తీసుకొచ్చాడు. రాజమౌళి తో పని చేసేందుకు ఆసక్తికరంగా ఉన్న అలియా భట్ త్వరలో RRR షూటింగ్ లో హాజరవబోతుంది. అయితే తాజాగా అలియా భట్ ఈ ఏడాది తాను అనుభవించిన మానసిక వేదనని షేర్ చేసింది. అంటే సోషల్ మీడియాలో స్టార్ కిడ్స్ విషయంలో నెటిజెన్స్ ట్రోలింగ్ కి బలైన తార అలియా భట్. సుశాంత్ సింగ్ మరణానంతరం అలియా భట్ తో పాటుగా చాలామంది స్టార్ కిడ్స్ ట్రోలింగ్ కి గురయ్యారు. అందులో అలియా భట్ మహేష్ భట్ కూతురు కావడంతో అలియా కి ఆ సెగ కాస్త ఎక్కువగా తగిలింది.

అందం అభినయం లేకుండానే అలియా భట్ బాలీవుడ్ పెద్ద దర్శకనిర్మాతల సహాయంతో స్టార్ హీరోయిన్ అయ్యింది అంటూ నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆ విషయంలో ఇప్పటివరకు కామ్ గా ఉన్న అలియా భట్ తాజాగా ఓపెన్ అయ్యింది. ఈ మధ్య కాలంలో తాను చాలా విద్వేషాన్ని ఎదుర్కొన్నా అని, ఎంతోమంది నెటిజెన్స్ తానని టార్గెట్ చేసుకుని నానారకాలుగా విమర్శిస్తున్నారని, సోషల్ మీడియా ద్వారా తనని తిడుతూ దారుణమైన కామెంట్స్ పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే అలంటి ట్రోల్స్ ని విమర్శలాగా కాకుండా స్పూర్తిగా తీసుకుంటా అని, తాను తాజాగా ఎదుర్కొన్న అనుభవాల నుండి తాను పాటలు నేర్చుకున్నానని, ముఖ్యంగా ఎదుటి వ్యక్తి పట్ల దయతో ఉండాలని తెల్సింది అంటూ చెప్పుకొచ్చింది అలియా భట్.

Netizens cyber bullyed me a lot, but I've taken it enthusiastically.. says Alia:

Alia until now never replied to these trolls!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ