మెగా డాటర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి హడావుడి రాజస్థాన్లోని ఉదయ్ పూర్ ఉదయ ప్యాలెస్ లో ఓ రేంజ్ లో మొదలయ్యాయి. నిహారికా అండ్ గ్యాంగ్ పెళ్లి పనుల్లో చేసే హడావిడి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటొస్ చూస్తే అర్ధమవుతుంది. మెగా ఫ్యామిలీ ఇప్పటికే రాజస్థాన్ వెళ్లగా.. ఇంకా చిరు అండ్ వైఫ్, పవన్ కళ్యాణ్ లు వెళ్లాల్సి ఉంది. ఇక అల్లు బాబీ, శ్రీజ, సుశ్మిత తో పాటుగా సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్, నిహారిక కజిన్స్, నిహారిక కాబోయే భర్త చైతన్య లు చేసే హడావిడి మాములుగా లేదు. మరో నాలుగు రాజుల్లో పెళ్లి పీటలేక్కబోతున్న నిహారిక - చైతన్యల వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే నిహారిక వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే ఇప్పుడు నిహారిక వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ అంటూ గంటకో ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది మెగా గ్యాంగ్. డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథుల లగ్నంలో పెళ్లి ముచ్చట జరగనుంది. రాజస్థాన్ లో జరగబోతున్న నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ కి మెగా ఫ్యామిలీతో పాటుగా కొద్దిమంది కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ మాత్రమే హాజరవుతున్నారని, ఇక పెళ్లి కూడా కరోనా నిబంధలు మేరకే జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే నిహారిక పెళ్లి రాజస్థాన్ లో జరిగినా.. హైదరాబాద్ లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో నిహారిక - చైతన్య వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా ప్లాన్ చేసిందట మెగా ఫ్యామిలీ.