Advertisementt

సోహైల్ - అఖిల్ కి సినిమా చూపించిన బిగ్ బాస్!

Fri 04th Dec 2020 03:58 PM
akhil,sohail,bigg boss,bigg boss 4  సోహైల్ - అఖిల్ కి సినిమా చూపించిన బిగ్ బాస్!
Akhil and sohail getting tested by Bigg boss సోహైల్ - అఖిల్ కి సినిమా చూపించిన బిగ్ బాస్!
Advertisement
Ads by CJ

 

బిగ్ బాస్ సీజన్ 4 లో టికెట్ టు ఫినాలే టాస్క్ లో ఒకొక్కరిగా ఎలిమినేట్ అయ్యి చివరికి అఖిల్ అండ్ సోహైల్ లు టికెట్ టు ఫినాలే టాస్క్ ఫైనల్ లెవెల్ కి వెళ్లారు. వాళ్ళిద్దరి మధ్యన పడిన టాస్క్ లో ఎవరు గెలిచినా ఓకె అన్నట్టుగా పోటీ పడ్డారు. అందులో భగంగా సోహైల్ - అఖిల్ లు లాన్ లో ఉన్న ఉయ్యాలలో కూర్చోవాలి. అలా ఉయ్యాల దిగకుండా ఎంత ఎక్కువ సేపు కూర్చుంటే వారే టికెట్ టు ఫినాలే టాస్క్ విన్నర్ అయ్యి టాప్ 5 లోకి ముందుగా అడుగుపెడతారు. మరి ఉయ్యాల్లో కూర్చోవడానికి ఏం నొప్పి బాగానే కూర్చుంటారు. అక్కడే బిగ్ బాస్ సోహైల్ అండ్ అఖిల్ కి ట్విస్ట్ ఇచ్చాడు. బిగ్ బాస్ కోల్డ్ మిల్క్ పంపి వాళ్లతో తాగించడం, అలాగే కూల్ జ్యూస్ తాగించడం, మాంగో జ్యూస్ తాగించడం లాంటివి చేస్తూ వాళ్ళు త్వరగా దిగి వాష్ రూమ్ కి పరిగెత్తే ప్లాన్ చేసారు.

మధ్యలో అవినాష్ వాళ్ళని డిస్టర్బ్ చెయ్యడానికి మోనాల్ ని తీసుకుని అఖిల్ దగ్గరకి రాగా మోనాల్ మీ తమ్ముడా అంటూ అవినాష్ గాలి తీసేసాడు అఖిల్. మోనాల్ అన్నయ్య అనగానే అవినాష్ అమ్మ తల్లి నీకో దండం అంటూ మోనాల్ ని పంపేశాడు. ఇక బిగ్ బాస్ పెట్టే కూల్ డ్రింగ్ పరీక్షకి సహనంతో కూర్చున్న సోహైల్ - అఖిల్ కి గన్ షాట్ సౌండ్స్ తో భయపెట్టాడు బిగ్ బాస్. గత వారం సోహైల్ - అఖిల్ లు డార్క్ రూమ్ లో దెయ్యలకి భయపడినట్లుగా ఇక్కడకూడా హడావిడి చేసి భయపెట్టి ఉయ్యాలా దిగే ప్లాన్ చేసాడు బిగ్ బాస్. మరి చివరి వరకు ఎవరు ఉయ్యాల్లో కూర్చుని టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచారో ఈ రోజు రాత్రి ఎపిసోడ్ లో చూడాలి.

Akhil and sohail getting tested by Bigg boss:

Bigg boss 4:Ticket to finale winnar?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ