గత కొన్నేళ్లుగా రాజకీయాల్లోకి అడుగుపెడతాను అంటూ ఊరిస్తున్న రజినీకాంత్ ఎప్పటికప్పుడు ఫాన్స్ కి హ్యాండ్ ఇస్తూనే ఉన్నాడు. ధైర్యం లేకనో.. ఆరోగ్యం సహకరించకో తెలియదుకాని.. రజినీకాంత్ రాజకీయ ఎంట్రీ విషయం కామెడీ అయ్యిపోయింది. రజిని రాజకీయాల్లోకి వస్తాడని ఎదురు చూస్తున్న ఫాన్స్ ఆశల మీద నీళ్లు చల్లుతున్న రజినీకాంత్ ఎట్టకేలకు రాజకీయ రంగ ప్రవేశం పై క్లారిటీ ఇచ్చేసాడు. ఆయన ఈ ఉదయం మీడియా సమావేశంలో రాజకీయ పార్టీపై స్పష్టతనిచ్చాడు. 2021 తమిళనాడు ఎన్నికల్లో మన పార్టీ పోటీ చేయబోతుంది అంటూ ఫాన్స్ కి ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు రజినీకాంత్. తమిళనాడు రాజకీయాల్లో అద్భుతం జరగబోతుంది అంటూ ప్రజలకు రజినీకాంత్ ఉత్సాహాన్ని ఇచ్చాడు.
ఇప్పటివరకు రజినీకాంత్.. ఫాన్స్ మీటింగ్స్, పొలిటికల్ మీటింగ్స్ అంటూ కాలయాపన చేసినా నేడు ఆయన రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టుగా చెప్పడంతో రజిని ఫాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. డిసెంబర్ 31 న రజినీకాంత్ ఆయన పెట్టబోయే పొలిటికల్ పార్టీ గురించిన అన్ని వివరాలను ప్రకటిస్తామని, జనవరిలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తామని రజిని మీడియా సమావేశంలో తెలిపాడు. కరోనా వలన తమిళనాడు అంతా పర్యటించలేకపోయా అని.. అర్జున్ మూర్తి పార్టీకి చీఫ్ కో ఆర్డినేటర్ గా ఉంటారని రజిని ప్రకటించాడు. లోకనాయకుడు కమల్ హాసన్ పార్టీ తో రజినీని కలుపుకుపోతామని చెబుతున్న టైం లో రజిని మాత్రం సింగిల్ గానే పార్టీ పెట్టబోతున్నట్టుగా చెప్పి కమల్ కి షాకిచ్చాడు. తమిళ ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్కచెయ్యనంటూ రజినీకాంత్ ఆవేశంతో మీడియాలో మాట్లాడాడు. ఇన్నాళ్లుగా సస్పెన్స్ లో పెట్టిన రజినీకాంత్ పొలిటికల్ పార్టీతో ఎట్టకేలకు రాజకీయ చదరంగంలోకి అడుగుపెడుతున్నాడు.