కరోనా కరోనా అంటూ సినిమా షూటింగ్స్ కి బ్రేకిచ్చిన చిత్ర పరిశ్రమ కరోనని లెక్క చెయ్యకుండా సెప్టెంబర్ నుండి సినిమా షూటింగ్స్ కి అనుమతులు రావడం.. అందరూ ఒక్కరిగా సెట్స్ మీదకెల్లడం జరిగింది. ఫ్యాన్ ఇండియా మూవీ షూటింగ్స్ కూడా జోరుగా స్టార్ట్ అవడంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ - సుకుమార్ ల పుష్ప కూడా ఈ మధ్యనే రంపచోడవరం, మరెడ్డిపల్లి అడవుల్లో ఫస్ట్ షెడ్యూల్ తో స్టార్ట్ అయ్యింది. అల్లు అర్జున్ - సుకుమార్ తో పాటుగా దాదాపుగా 800 మంది యూనిట్ సభ్యులతో రంపచోడవరం అడవుల్లో స్టార్ట్ అయిన పుష్ప షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది.
కారణం కరోనా కాదంటున్నారు కానీ.. కరోనా వలనే పుష్ప షూటింగ్ ఆగింది అని.. కాకపోతే యూనిట్ సభ్యుల్లో ఒకరికి ప్రాణాపాయం కలగడంతో పుష్ప టీం హుటాహుటిన షూటింగ్ క్యాన్సిల్ చేసి హైదరాబాద్ వచ్చేసినట్టుగా తెలుస్తుంది. మారేడ్ పల్లి అడవుల్లో పుష్ప టీ షూటింగ్ భారీ టెక్నీకల్, జూనియర్ ఆర్టిస్టుల మధ్యన యాక్షన్ సీక్వెన్సెస్ తో స్టార్ట్ అయ్యింది. ఆ ఫస్ట్ షెడ్యూల్ లో సుకుమార్ 800 మంది యూనిట్ సభ్యులతో షూటింగ్ చెయ్యడం, అక్కడ ఒకరోజు పుష్ప షూటింగ్ కి 40 నుండి 45 లక్షల ఖర్చు కూడా అవుతుంది అని ప్రచారం జరుగుతుంది. మరి అంత హంగామాతో మొదలయిన షూటింగ్ ఇలా కరోనాకి దొరికిపోయి షూటింగ్ ఆగిపోవడం నిర్మాతల్లో టెంక్షన్ మొదలయ్యేటట్టు చేసింది.