Advertisementt

వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ అదిరిపోతుందట!

Fri 04th Dec 2020 10:14 AM
pawan kalyan,shruti haasan,vakeel saab,venu sriram,dil raju  వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ అదిరిపోతుందట!
Pawan Kalyan Vakeel Saab Flashback Awesome! వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ అదిరిపోతుందట!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - వేణు శ్రీరామ్ కాంబోలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ షూటింగ్ ఓ 20 రోజుల్లో ఫినిష్ అవుతుంది అన్నారు. కానీ మధ్యమధ్యలో పవన్ కళ్యాణ్ ఇచ్చే బ్రేకులకి వకీల్ సాబ్ షూటింగ్ ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియడం లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ గ్రేటర్ ఎన్నికలంటూ హడావిడి చేసాడు. ఇప్పుడు ఆ ఎన్నికల హడావిడి ముగిసాక ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టాడు. అక్కడ నివార్ తుఫాన్ బాధిత రైతులని, పొలాల పరిశీలనలో ఉన్నాడు. ఇక వకీల్ సాబ్ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం పవన్ కళ్యాణ్ లిక్విడ్ డైట్ కూడా మొదలు పెట్టాడు.

అయితే వకీల్ సాబ్ లో ఫ్లాష్ బ్యాగ్ ఎపిసోడ్ అదిరిపోతుది అని.. దాని కోసమే పవన్ బరువు తగ్గుతున్నాడని అంటుంటే.. ఆ కీలక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హీరోయిన్ శృతి తో రొమాంటిక్ సాంగ్ కూడా ఉండబోతుంది అని అంటున్నారు. శృతి హాసన్ వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ భార్యగా కనిపించబోతుంది. పింక్ సినిమాలో ఇలాంటి డ్యూయెట్స్ ఏముండకపోయినా.. పవన్ హీరోయిజం కోసం కొన్ని మార్పులు చేసిన వేణు శ్రీరామ్ ఫాన్స్ కోసం ఓ సాంగ్ కూడా పెట్టాడట. ఇప్పుడు ఆ సాంగ్ ని చిత్రీకరించడానికి వేణు శ్రీరామ్ పవన్ -శృతి లతో పాటుగా కేరళ వెళ్లనున్నాడని తెలుస్తుంది. అయితే నిహారిక పెళ్లి తర్వాత పవన్ కేరళ ప్రయాణం ఉండబోతున్నట్లుగా సమాచారం. 

Pawan Kalyan Vakeel Saab Flashback Awesome!:

Pawan Vakeel Saab movie latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ