పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కి విడాకులిచ్చాక మరో పెళ్లి చేసుకుని.. ఓ బిడ్డకి తండ్రి కూడా అయ్యాడు. తర్వాత రాజకీయాలు అంటూ ఏపీ రాజకీయాల్లో చురకైన పాత్ర పోషిస్తున్నాడు. మరోపక్క ఈ ఏడాది ఆరంభంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ కూడా ఇచ్చాడు. అయితే అటు రాజకీయాలు ఇటు సినిమా షూటింగ్ అంటూ హడావిడిగా పరిగెత్తే పవన్ తన మాజీ భార్య రేణు తో పిల్లలు అకీరా, ఆద్యల కోసం అప్పుడప్పుడు టైం స్పెండ్ చేస్తుంటాడు. ఎందుకు అంటే తన పిలల్లు ఇప్పుడు రేణు దేశాయ్ సంరక్షణలోనే ఉంటున్నారు కాబట్టి. మొన్నామధ్యన హైదరాబాద్ లో పవన్ తన పిల్లలు అకీరా, ఆద్యల కోసం ఇల్లు కొనిపెట్టాడనే టాక్ కూడా ఉంది.
ఇక అకీరా, ఆద్యల పుట్టిన రోజులకి పవన్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గరకి వెళ్లి వాళ్ళ పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తుంటాడు. గతంలో రేణు దేశాయ్ తన పిల్లలతో పాటుగా పూణేలో ఉండేది. కానీ ఇప్పుడు రేణు దేశాయ్ హైదరాబాద్ కే షిఫ్ట్ అయ్యింది . దానితో పవన్ వీలున్నప్పుడల్లా పిల్లలను కలుస్తూ తండ్రి ప్రేమని కురిస్తుంటాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తన కూతురు ఆద్య, కొడుకు అకీరాలని పవన్ కళ్యాణ్ ప్రేమగా హగ్ చేసుకుని ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పవన్ వడిలో అకీరా నందన్, ఆద్యలు నిద్ర పోతున్నప్పుడు క్లిక్ మనిపించిన ఆ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.