రవితేజ క్రాక్ సినిమా పూర్తి చేసి.. రమేష్ వర్మ ఖిలాడీ కోసం కొత్తగా మేకోవర్ అవుతున్నాడు. రమేష్ వర్మతో ఖిలాడీ సినిమాని ప్రకటించిన రవితేజ ఆ సినిమాలో కొత్తగా కనిపించడానికి బాగా వర్కౌట్స్ కూడా చేస్తున్నాడట. అయితే ఖిలాడీ సినిమా తమిళ శతురంగ వేట్టై-2 రీమేక్ గా తెరకెక్కబోతుంది అనే టాక్ ఉంది. అయితే తాజాగా ఈ సినిమాలో విలన్ గురించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది ఖిలాడీకి విలన్ గా అంటే రవితేజ తో ఖిలాడీ లో తలపడబోయే విలన్.. తమిళ హీరో అర్జున్ అంటున్నారు. అర్జున్ గతంలో లై సినిమాలోను, విశాల్ అభిమన్యుడు సినిమాలో విలన్ గా అదరగొట్టేసాడు.
లై సినిమాలోనూ, అభిమన్యుడు సినిమాలో అర్జున్ స్టైలిష్ విలన్ గా నటించాడు. అయితే తాజాగా ఖిలాడీ సినిమాలోనూ విలన్ పాత్రకి బాగా పవర్ ఫుల్ గా ఉండబోతుంది. ఈమధ్యన దర్శకులు అంతా విలన్ పాత్రని హీరోలతో సమానమైన వెయిట్ ఇస్తున్నట్టే రమేష్ వర్మ కూడా తన సినిమాలో విలన్ పాత్ర బాగా పవర్ ఫుల్ గా ఉండాలని.. అలాంటి పాత్ర కోసం అర్జున్ అయితే పర్ఫెక్ట్ అనుకున్న టీం.. అర్జున్ ని సంప్రదించారని.. విలన్ పాత్ర కీలకంగా ఉండడంతో అర్జున్ కూడా ఓకె చెప్పాడని టాక్ మొదలైంది. మరి రవితేజ కోసం యాక్షన్ కింగ్ దిగుతున్నాడనే ఆ సినిమాపై అంచనాలు కూడా పెరగడం ఖాయం.