Advertisementt

చిరూ మరీ ఇంత తొందరగా వేదాళం రెడీ చేస్తున్నాడా?

Wed 02nd Dec 2020 01:18 PM
meher ramesh,chiranjeevi,vedalam remake,shooting  చిరూ మరీ ఇంత తొందరగా వేదాళం రెడీ చేస్తున్నాడా?
Chiranjeevi - Meher Ramesh Vedalam Remake Shooting started? చిరూ మరీ ఇంత తొందరగా వేదాళం రెడీ చేస్తున్నాడా?
Advertisement
Ads by CJ

చిరంజీవి ఆచార్య సినిమా బ్రేక్ కి టాటా చెప్పి.. కొద్దీ రోజుల ముందు నుండే ఆచార్య షూటింగ్ లో పాల్గొంటున్నాడు. కొరటాల దర్శకత్వంలో ఆచార్య షూటింగ్ ఈపాటికి ఫినిష్ కావాల్సిందే. కానీ కరోనా కారణంగా చిరూ ఇంటికే పరిమితమయ్యాడు. దానితో ఆచార్య షూటింగ్ లేట్ అవడం చిరూ తదుపరి ప్రాజెక్ట్స్ వెనక్కి వెళ్లడం జరిగింది. వయసు రీత్యా చిరూ ఒకటి తర్వాత ఒక సినిమా పూర్తి చేస్తాడని అనుకుంటున్నారు. కానీ చిరు వరస కమిట్మెంట్స్ చూస్తే.. రెండు సినిమాలను ఒకేసారి పూర్తి చేస్తాడేమో అనిపించేలా ఉన్నాయ్. తాజాగా మెహర్ రమేష్ తో వేదాళం రీమేక్ కి ఓకె చెప్పిన చిరు.. అంతే ఫాస్ట్ గా లుక్ టెస్ట్ కూడా చేయించుకున్నాడు. కానీ ఆచార్య షూటింగ్ తో పాటుగా వేదాళం షూటింగ్ కూడా అనుకుంటే.. లేదు చిరూ ఆచార్య పూర్తి చేసాక అంటే వచ్చే ఏప్రిల్ నుండి వేదాళం రీమేక్ లోకి వెళ్లాడని అన్నారు.

కానీ ఇప్పుడు చిరు వేదాళం రీమేక్ కూడా మొదలైపోయినట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినబడుతుంది. వేదాళం రీమేక్ షూటింగ్ మొదలవడమే కాదు... కొన్ని మాంటేజ్ షాట్స్ కూడా చిత్రీకరించారని అంటున్నారు. కలకత్తా నేపథ్యంలో తెరక్కేయబోయే ఈ సినిమాలో మాంటేజ్ షాట్స్ కావాల్సి రావడంతో మెహర్ రమేష్ బ్యాచ్ అక్కడ కలకత్తాలో దసరా ఉత్సవాలు జరిగే టైం లోనే కొన్ని షాట్స్ షూట్ చేసుకుని వచ్చిందట.. ఆ షాట్స్ సినిమాలో ప్రత్యేకంగా నిలుస్తాయని.. సో ఆ షాట్స్ షూట్ తోనే వేదాళం ఆఫీషి యల్ గా మొదలిపోయినట్టే అంటున్నారు. ఆ దసరా ఉత్సవాల సన్నివేశాలు సినిమాకి కీలకం కాబట్టి వచ్చే దసరా వరకు ఆగి మళ్ళీ ఆ సన్నివేశాల షూట్ చేస్తే లేట్ అవుతుందనే ఉద్దేశ్యంతో మెహర్ అలా చేసాడట. అంటే చిరు వేదాళం రీమేక్ షూట్ లో పాల్గొనకపోయినా.. అధికారికంగా వేదాళం అయితే పట్టాలెక్కేసింది. 

Chiranjeevi - Meher Ramesh Vedalam Remake Shooting started?:

Meher Already Started The Vedalam Remake Shoot

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ