Advertisementt

బిగ్ బాస్ లో విడిపోయిన జంటలు!

Wed 02nd Dec 2020 10:32 AM
bigg boss 4,akhil,monal,harika,abhijeet  బిగ్ బాస్ లో విడిపోయిన జంటలు!
Bigg Boss4: Breaks 2 Relationships బిగ్ బాస్ లో విడిపోయిన జంటలు!
Advertisement
Ads by CJ

బాస్ సీజన్ 4 లో ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ సభ్యులకు పీకుతున్న క్లాస్ అప్పుడప్పుడు మిస్ ఫైర్ అయినా.. కొన్నిసార్లు పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. ఇంటి సభ్యులు డల్ గా ఉన్నా, లేదంటే టాస్క్ పెరఫార్మెన్సెస్ లో వీక్ గా ఉన్నా, లేదంటే హౌస్ మేట్స్ కారణంగా గొడవలు పడినా నాగార్జున అస్సలూరుకోడు. శనివారం వచ్చింది అంటే అందరిని నుంచోబెట్టి కడిగిపారేస్తాడు. బిగ్ బాస్ లోకి మీరెందుకు వచ్చారు. విన్నర్ అవడానికి కానీ.. గొడవలు పడడానికి, లేదంటే టాస్క్ ఆడకుండా ఉండడానికి కాదంటూ సున్నితంగానే చురుకైన మాటలతో హౌస్ మేట్స్ లో కదలిక తీసుకొస్తాడు. తాజాగా శనివారం నాగ్ పీకిన క్లాస్ కి హరిక దగ్గరనుండి మోనాల్, అఖిల్ తో సహా అందరూ దారిలోకొచ్చారు. హారిక కి నాగార్జున పీకిన క్లాస్ తో అభిజిత్ ని నామినేట్ చేసి ప్రేక్షకులకే షాకిచ్చింది. హారిక - అభిజిత్ అంటే మంచి ఫ్రెండ్.. సం థింగ్ సం థింగ్ అనుకున్న ప్రేక్షకులకు హరిక బాగా షాకివ్వగా.. ఆభిజీత్ కూడా హారికాని నామినేట్ చేసి రివెంజ్ తీర్చుకున్నాడు. 

దానితో అభిజిత్ డల్.. హారిక ఏడుపు. మరి వారి రిలేషన్ బ్రేక్ అయినట్లే కనబడుతుంది. ఇక అఖిల్ మోనాల్ ని, మోనాల్ అఖిల్ ని నామినేట్ చేసి ఇంకా పెద్ద షాకిచ్చారు. మోనాల్ ని సరిగా ఆడు అన్న అఖిల్ ని మోనాల్ నామినేట్ చెయ్యడమే కాదు గట్టిగా ఏసుకుంది. అక్కడితో మోనాల్ అండ్ అఖిల్ రిలేషన్ బ్రేక్ అయ్యింది. అవినాష్ తో మోనాల్ గొడవ.. సోహైల్ - అరియనా టామ్ అండ్ జెర్రీ ఆటతో సోమవారం నామినేషన్స్ ముగిసాయి. నిజంగా ఇప్పటివరకు రిలేషన్స్ ని మెయింటింగ్ చేస్తూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఒకరిని ఒకరు కాపాడుకున్న అఖిల్ - మోనాల్, హారిక - అభిజిత్ ల రిలేషన్స్ ఈ వారంతో బ్రేక్ అయ్యాయనే చెప్పాలి. ఇక ఈ రోజు బిగ్ బాస్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ లో ఆవు పాలు టాస్క్ తో హౌస్ మేట్స్ కొట్టువాడానికి సిద్ధంగా ఉన్నారు.

Bigg Boss4: Breaks 2 Relationships:

Bigg Boss 4: Rift Between Abijeet, Harika And Akhil, Monal