పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఆయనతో సినిమాలు చెయ్యాలనే కోరికతో దర్శకనిర్మాతలు పవన్ వెంట పడుతున్నారు. పవన్ కి కథ చెప్పి ఇప్పటికే నలుగురు డైరెక్టర్స్ ఆయన్ని లైన్ లో పెట్టుకున్నారు. వకీల్ సాబ్ తో కలిపి పవన్ కళ్యాణ్ అక్షరాల ఐదు సినిమాలు చెయ్యాల్సి ఉంది. ఈ ఏడాది మొదట్లో మొదలైన వకీల్ సాబ్ షూటింగ్ ఇంకా కొలిక్కి రాలేదు. ఇంకా క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, శేఖర్ కే చంద్ర సినిమాలను పవన్ చెయ్యాల్సి ఉండగా.. ఇక పవన్ తో సినిమాలు చేసేందుకు దర్శకులు వెంట పడుతూనే ఉన్నారు. పవన్ తో ఓకె చేయించుకుంటే చాలు ఎప్పుడు సినిమా తీసిన ఓకె అన్నట్టుగా ఉన్నారు.
తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫేర్ జానీ మాస్టర్ పవన్ తో సినిమా చేసి దర్శకుడిగా మారాలనే ప్రయత్నాల్లో ఉన్నాడని ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న టాక్. ఆ విషయంలో జానీ మాస్టర్ కి రామ్ చరణ్ హెల్ప్ కూడా ఉండబోతుంది అనే టాక్ మొదలయ్యింది. పవన్ కళ్యాణ్ తో జానీ మాస్టర్ డైరెక్ట్ చేసే చిత్రానికి రామ్ చరణ్ నిర్మాత గా ఉండబోతున్నాడట. పవన్ తో రామ్ చరణ్ ఓ సినిమా నిర్మిస్తాడనే టాక్ ఉంది. ఈమధ్యనే వకీల్ సాబ్ సెట్స్ లో పవన్ కళ్యాణ్ ని కలిసిన జానీ మాస్టర్.. పవన్ తో కలిసి ఫొటోస్ తీయించుకుని హడావిడి కూడా చేసాడు. అయితే తాజాగా జానీ మాస్టర్ పవన్ తో సినిమా చెయ్యాలని రామ్ చరణ్ కి కథ వినిపించగా.. చరణ్ జానీ కి బాబాయ్ తో సినిమా చేస్తున్నాం నువ్వు పూర్తి కథ రెడీ చేసుకోమని చెప్పినట్టుగా ఫిలింనగర్ టాక్.