కరోనా వలన షూటింగ్స్ అన్ని చెల్లాచెదురు అయ్యాయి. దానితో హీరోల సినిమా షెడ్యూల్స్, విడుదల తేదీలు అన్ని మారిపోయాయి. ఇక ఓ సినిమా చేస్తున్న హీరోలకి తర్వాత ఒప్పుకున్న సినిమాలు లేట్ అయ్యేలా కనిపించడంతో ఫాన్స్ బాగా ఫీలవుతున్నారు. ఇక రాజమౌళి RRR లో ఇరుక్కున్న ఎన్టీఆర్ ఎప్పుడు బయటపడతాడో అని త్రివిక్రమ్ కూడా వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే RRR అవ్వగానే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా చెయ్యాల్సి ఉంది. కానీ RRR ఎప్పుడు పూర్తవుతుందో.. ఎన్టీఆర్ తన సినిమా సెట్స్ మీదకెప్పుడొస్తాడో అని త్రివిక్రమ్ మదనపడుతున్నాడు. మరోపక్క చిరు ఆచర్యలోకి రామ్ చరణ్ వెళ్ళాలి. దానికి RRR పూర్తవ్వాలి.
రాజమౌళితో పెట్టుకుంటే హీరోలు లాక్ అవ్వాల్సిందే. జక్కన్న చెక్కిందే చెక్కుతాడు. అసలే కరోనా, మరోపక్క జక్కన్న అంటూ ఎన్టీఆర్, రామ్ చరణ్ నెక్స్ట్ దర్శకులు త్రివిక్రమ్, కొరటాల మాములుగా టెంక్షన్ పడడం లేదు. కానీ ఇప్పుడు రాజమౌళి స్పీడు చూస్తే ఎవరూ హీరోల కోసం వెయిట్ చెయ్యాల్సిన అవసరం కనిపించడం లేదు. ఎందుకంటే రాజమౌళి తాజగా మొదలెట్టిన RRR 50 రోజుల లాంగ్ షెడ్యూల్ ని ఏకధాటిన పూర్తి చేసి ఔరా అనిపించాడు. 50 రోజుల భారీ యాక్షన్స్ సీక్వెన్సెస్ ని రాజమౌళి పూర్తి చేసి చూపించాడు. విపరీతమైన చలి టైం లో రాజమౌళి RRR నైట్ షూట్స్ ని 50 రోజుల పాటు ఏకధాటిగా చిత్రీకరించాడట.
ఆ 50 రోజుల నైట్ షూట్ లో రాజమౌళి ఒక్క యాక్షన్ ఎపిసోడ్ నే పూర్తి చేసి చూపించాడట. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలవబోతుందట. మరి రాజమౌళి చిన్నపాటి గ్యాప్ తీసుకోకుండా.. ఇలా RRR షూటింగ్ పూర్తి చేస్తుంటే.. ఎన్టీఆర్ అండ్ చరణ్ లు త్వరగానే RRR ఫినిష్ చేస్తారని త్రివిక్రమ్ అండ్ కొరటాల ముందు సంతోష పడిపోతున్నారట.