బాలీవుడ్ లో తెరకెక్కబోయే సినిమాలను మొదలు పెట్టకముందే విడుదల డేట్స్ లాక్ చేసుకుంటారు అక్కడ దర్శకనిర్మాతలు. కానీ టాలీవుడ్ సినిమాలు సగం పూర్తయ్యాక గాని విడుదల డేట్స్ ఇవ్వరు. ప్రస్తుతం కరోనాతో పోస్ట్ పోన్ అయిన సినిమాలన్ని, అందులోను పాన్ ఇండియా మూవీస్ కూడా ప్రస్తుతం సెట్స్ మీద షూటింగ్ చేసుకుంటున్నాయి. అందులో అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా కూడా ఉంది. అల్లు అర్జున్ - సుకుమార్ మొదటిసారిగా పాన్ ఇండియాలోకి పుష్పతోనే అడుగుపెడుతున్నారు. అయితే తాజాగా పట్టాలెక్కిన పుష్ప సినిమా వచ్చే ఏడాదిలో విడుదలవుతుది అంటే పుష్ప యూనిట్ కే నమ్మకం లేదు.
అందుకే రిలీజ్ డేట్ కోసం ఆలోచించకుండా తమ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు సుక్కు అండ్ అల్లు అర్జున్ లు. కొద్దిమేర షూటింగ్ అయ్యాకే తమ సినిమా విడుదల డేట్ ఇవ్వాలని వాళ్ళ ప్లాన్. పాన్ ఇండియా అన్నాక ముందు రిలీజ్ డేట్ ఇచ్చేస్తే బాలీవుడ్ ప్రేక్షకులకి,అక్కడి హీరోలకి ఓ క్లారిటీ ఉంటుంది. ప్రభాస్ సాహో విషయంలో చివరివరకు రిలీజ్ డేట్ విషయంలో నాన్చారు. ప్రమోషన్స్ విషయంలో నెగ్లెట్ గా ఉండడంతో సాహో కి మైనస్ అయ్యింది. ఇక రాజమౌళి లాంటోడు రిలీజ్ డేట్ లేట్ ఇచ్చినా.. ప్రమోషన్స్ విషయంలో పక్కా ప్లాన్ ఉంటుంది. మరి అల్లు - సుక్కు ఫస్ట్ టైం కాబట్టి పక్కా ప్రమోషన్స్ ఉంటే సినిమాకి పెద్ద ప్లస్ అవుతుంది.
ఇప్పటికే అల్లు అర్జున్ బాలీవుడ్ మీడియాతో టచ్ లో ఉన్నాడనే టాక్ ఉంది. మరి పుష్ప ని బాలీవుడ్ మీడియాకి, ప్రేక్షకులకి రీచ్ చేస్తే సగం భారం తీరుతుంది. ఆ విషయంలో అల్లు అర్జున్ ప్లాన్ వేరె ఉన్నాయంటున్నారు. ఇప్పటికే అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ పార్టీలు కూడా ఇస్తున్నాడని టాక్ ఉంది. మరి పుష్ప వచ్చే ఏడాది విడుదల కష్టమే అందుకే సైలెంట్ గా షూటింగ్ చేసుకుంటున్నారట. ఎలాగూ సుకుమార్ కి నచ్చకపొతే సీన్స్ రీ షూట్స్ చేస్తూ టైం గడిపేస్తాడు. అందుకే పక్కాగా వచ్చే ఇది పుష్ప రానట్లే అంటున్నారు.