పాన్ ఇండియా మూవీ అంటే.. బాలీవుడ్ నటులను పెట్టేస్తే సినిమాకి క్రేజ్ వచ్చేస్తుంది అనుకుంటే పొరబాటే. బాలీవుడ్ నటులను భారీ బడ్జెట్ పెట్టి మరీ తీసుకొచ్చి నిర్మాతలకు తల బొబ్బి కట్టినా.. క్రేజ్ కోసం బాలీవుడ్ నటులనే ఎంపిక చేసుకుంటే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి కచ్చితంగా క్రేజ్ వచ్చేస్తుంది అనుకుంటే.. దానికన్నా పెద్ద తప్పు మరొకటి లేదు. ఎందుకంటే ప్రభాస్ బాహుబలి క్రేజ్ తో సాహో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించాడు.. అంత వరకు ఓకె. కానీ క్రేజ్ కోసం పాన్ ఇండియా మూవీ కదా అని బాలీవుడ్ నటుల్ని ఎడా పెడా తీసుకొచ్చి అందులో భాగం చేసాడు. వారి వలన సినిమాకి క్రేజ్ రాకపోగా.. ఉపయోగమే లేకుండా పోయింది.
తాజాగా ఆదిపురుష్ కోసం ప్రభాస్ అండ్ బ్యాచ్ అదే పని చేస్తున్నారు. సాహో లో సౌత్ కి పరిచయం లేని శ్రద్ద కపూర్ ని హీరోయిన్ గా తీసుకుంటే.. అది బెడిసికొట్టింది. తాజాగా ఒక్క హిట్టు లేని కృతి సనన్ ని ఆదిపురుష్ హీరోయిన్ అంటున్నారు. తెలుగులో కృతి చేసిన సినిమాలన్నీ ప్లాప్. అలాగే బాలీవుడ్ లోను క్రేజ్ లేని హీరోయిన్ ని హీరోయిన్ గా తీసుకుంటే క్రేజ్ కన్నా దండగ యవ్వారం తప్ప మరొకటి ఉండదు. ఇక విలన్ విషయంలోనూ ఓం రౌత్ అదే చేసాడు. సౌత్ కి పరిచయమే లేని సైఫ్ ని విలన్ గా ఎంచుకున్నాడు. అక్షయ్ కుమార్, సంజయ్ దత్, అజయ్ దేవగన్ లాంటి వాళ్ళైతే సౌత్ కి అంతో ఇంతో పరిచయం ఉన్న పేర్లు.
సైఫ్ అలీ ఖాన్ అంటే సౌత్ కి క్రేజ్ లేని పేరు. ఇక ఇప్పుడు హీరోయిన్ విషయంలో కూడా ఓం రౌత్ తప్పు చేస్తున్నాడనే టాక్ తో ప్రభాస్ ఫాన్స్ గగ్గోలు పెడుతున్నారు. ఆదిపురుష్ హీరోయిన్ గా కృతి సనన్ ఫిక్స్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా.. ప్రభాస్ ఫాన్స్ కి కంగారు పుట్టింది. సాహో విషయంలో చేసిన తప్పే ఆదిపురుష్ కి జరుగుతుంది.. హీరోయిన్ కృతి సనన్ మాకొద్దు అంటున్నారు. కేవలం బాలీవుడ్ కి సరిపోయే నటులను తీసుకుంటే ఎలా.. సౌత్ ప్రేక్షకులకి నచ్చాలిగా.. అయినా కృతి సనన్ హిట్ హీరోయిన్ కూడా కాదు... అంటూ వాళ్ళు ఓం రౌత్ కి రిక్వెస్ట్ లు పెట్టుకుంటున్నారు.