ప్రస్తుతం టాప్ సెలెబ్రిటీస్ అందరూ మాల్దీవులకు చెక్కేసి అక్కడ సముద్రపు ఒడ్డున బీచ్ లో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ బ్రదర్స్, సిస్టర్స్ తో వెళితే కొంతమంది మాత్రం భర్తతో షికార్లు చేస్తున్నారు. ఇక అక్కడ సముద్రపు అడుగున స్కూబా డైవిన్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్స్ చాలామంది ఇప్పుడప్పుడే మాల్దీవులని వదిలేలా కనిపించడం లేదు. సమంత అయితే రోజుకో ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసి ఊరిస్తుంది. రకుల్ ప్రీత్ కూడా బికినీ షో, ఆ షో ఈ షో అంటూ కేక పెట్టిస్తుంది. మాల్దీవుల్లో ఎవరు ఎలా ఎంజాయ్ చేసినా సమంత, రకుల్ అందాలు ఆరబోత, వారు చేసే చిలిపి పనులు మాత్రం సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి.
సమంత అయితే నేచురల్ బ్యూటీలా మొక్కలతో కలిసిపోతుంటే.. రకుల్ మాత్రం ఉయ్యాలలో రకరకాల ఫోజులతో అదరగడుతుంది. నాగ చైతన్య బర్త్ డే వేడులకి మాల్దీవులు వెళ్లిన సమంత ఇంకా బీచ్ వెంట షికార్లు చేస్తుంటే.. రకుల్ ప్రీత్ కూడా నేనేమి తక్కువ తిన్నానా అంటూ ఎంజాయ్ చేస్తుంది. మరి సమంత బ్యాక్ లుక్, రకుల్ ఫ్రెంట్ లుక్ ఫొటోస్ సోషల్ మీడియాలో కనబడుతుంటే యూత్ లైక్ లే లైకులు... షేరులే షేరులు కొడుతున్నారు. ఆలా ఉంది ఈ ఇద్దరి హీరోయిన్స్ మాల్దీవుల ఎంజాయ్మెంట్.