Advertisementt

సిస్టర్స్ తో పార్టీ చేసుకున్న నిహారిక!!

Sun 29th Nov 2020 10:12 PM
mega daughter,niharika konidela,party,mega sisters,niharika weeding  సిస్టర్స్ తో పార్టీ చేసుకున్న నిహారిక!!
Niharika Konidela Throws Grand Party For Sisters సిస్టర్స్ తో పార్టీ చేసుకున్న నిహారిక!!
Advertisement
Ads by CJ

మెగా డాటర్ నిహారిక పెళ్లి మరో పది రోజుల్లో అంటే డిసెంబర్ 9 న రాజస్థాన్ ఉదయపూర్ ఉదయ్ ప్యాలెస్ లో జరగబోతుంది. గుంటూరు రేంజ్ ఐజి కొడుకు చైతన్య ని వివాహం చేసుకోబోతున్న నిహారిక తన బ్యాచిలర్ పార్టీని తన ఫ్రెండ్స్ తో కలిసి గోవాలో జరుపుకుంది. అక్కడ బాగా ఎంజాయ్ చేసిన నిహారిక గత వారమే రాజస్టాన్ కి వెళ్ళిపోయింది. నిహారిక పెళ్లి ఏర్పాట్లని ఆమె అన్న వరుణ్ తేజ్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. అయితే ఈ పెళ్ళికి పవన్ కళ్యాణ్ రెండు రోజుల ముందే హాజరవుతాడనే టాక్ ఉంది. అలాగే మెగా ఫ్యామిలీ నాలుగు రోజుల ముందే రాజస్థాన్ కి వెళ్ళిపోతుంది అని ప్రచారం జరుగుతుంది.

అయితే నిహారిక తన పెళ్లి సందర్భంగా సిస్టర్స్ కి గ్రాండ్ పార్టీ ఇచ్చేసింది. మెగా స్టార్ చిరు కూతుళ్లు సుశ్మిత, శ్రీజ లతో పాటుగా ఇంకొంతమంది కజిన్స్ కి నిహారిక గ్రాండ్ గా సిస్టర్స్ పార్టీ ఇచ్చిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చెల్లి పెళ్లి పార్టీలో అక్కల హడావిడి.. అంటూ ఆ ఫోటో కి క్యాప్షన్ పెట్టి మరీ వైరల్ చేస్తున్నారు మెగా ఫాన్స్. మరి నిహారికపెళ్లి కి ముందే రాజస్థాన్ లో ఇలాంటి పార్టీలు, మెహిందీ వేడుకలు, సంగీత్ ఫంక్షన్స్ అన్నిటికి మెగా ఫ్యామిలీ కచ్చితంగా హాజరవ్వాల్సిందే.  అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే మెగా ఫ్యామిలీ రాజస్థాన్ కి పయనమవ్వాల్సి ఉంటుంది మరి.

Niharika Konidela Throws Grand Party For Sisters:

Mega Daughter Niharika Konidela Throws Grand Party For Mega Sisters

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ