Advertisementt

మంచు లక్ష్మి ఆ హీరోని పెళ్లాడాలనుకుందట!

Sun 29th Nov 2020 01:28 PM
manchu lakshmi,nagarjuna,amir khan  మంచు లక్ష్మి ఆ హీరోని పెళ్లాడాలనుకుందట!
Manchu Lakshmi wanted to marry that Hero!! మంచు లక్ష్మి ఆ హీరోని పెళ్లాడాలనుకుందట!
Advertisement
Ads by CJ

మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి సినిమాల్లో తన ఐడెంటిటీ కోసం పోరాడుతూనే ఉంది. నటిగాను, నిర్మాతగానూ, మరోపక్క టాక్ షోస్ తో మంచు లక్ష్మి దూసుకుపోతుంది. తాజాగా తన కూతురు విద్య నిర్వాణతో కలిసి కొత్త ఆఫీస్ లోకి అడుగుపెట్టియే మంచు లక్ష్మి తాను ఓ హీరోని ఇష్టపడ్డ విషయాన్నీ బయటపెట్టింది.  అయితే ఆ హీరో పెళ్లి చేసుకున్నప్పుడు తెగ ఫీలయ్యిందట. తెగ ఏడ్చేసిందట లక్ష్మి. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మంచు లక్ష్మి తన కిష్టమైన హీరోల గురించి, తాను ఇష్టపడ్డ హీరో గురించి చెప్పుకొచ్చింది. మంచు లక్ష్మీ హార్ట్ బ్రేక్ చేసిన హీరో మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అంట.

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అంటే చాలా ఇష్టమట లక్ష్మికి. అమీర్ ఖాన్ కి పెళ్లయిందని తెలిసి చాలా ఏడ్చిందట. ఆయన పెళ్లి చేసుకున్నాడు అని తెలిసాక చాలా భాధ అనిపించింది అని చెబుతుంది లక్ష్మి. ఆఖరికి అమీర్ ఖాన్ రెండో పెళ్లి అయినపుడు కూడా మంచు లక్ష్మి ఏడ్చేసిందట. అమీర్ ఖాన్ అంటే ఎందుకిష్టమో చెప్పింది. అమీర్ ఖాన్ సినిమాలు ఎంచుకునే విధానం తనకి బాగా నచ్చుతుంది అని చెప్పిన మంచు లక్ష్మి కి టాలీవుడ్ మన్మధుడు నాగార్జున అన్నా ఇష్టమట. నాగార్జునకి తాను వీరాభిమాని అంటుంది. అమీర్ ఖాన్, నాగార్జున పేరు వింటేనే తనకి ఏదోలా అయ్యిపోతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది లక్ష్మి.

Manchu Lakshmi wanted to marry that Hero!!:

She says that she loves Nagarjuna and Amir khan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ