రానాకి కొని ఆరోగ్యపరమైన సమస్యలున్నాయనే విషయం సోషల్ మీడియాలో ఎప్పుడో లీకైంది. రానా కి కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాయని.. ఆయనకి కంటికి ప్రాబ్లెమ్ ఉందని, అలాగే రానాకీ బిపి ఉన్న విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా సమంత ఆహా టాక్ షో సామ్ జాం ప్రోగ్రాం లో రానా తన ఆరోగ్య విషయాలను క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చాడు. సమంత రానా ని ఉద్దేశించి మన ఫ్యామిలీ అంత కాశ్మిర్ ట్రిప్ వెళ్ళినప్పుడు నీకు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.. అప్పుడేం జరిగింది అని అడగగా.. దానికి రానా అరణ్య సినిమా కోసం కంటికి లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి డాక్టర్ ని కలవగా ఆయన అన్ని టెస్ట్ లు చేసి.. నీకు బిపి ఉంది సో నువ్వు మరో డాక్టర్ ని కలవు అని చెప్పారు.
నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్లగా నీకు చిన్నప్పటినుండి బిపి ఉంది.. సో మరికొన్ని టెస్ట్ లు చెయ్యాలని చెప్పారు.దానితో నాన్న ని తీసుకుని అమెరికా వెళ్లగా అక్కడ డాక్టర్ అన్ని టెస్ట్ లు చేసి నీకు చిన్నప్పటి నుండి బిపి ఉన్న కారణంగా నీ ఆరోగ్యం దెబ్బతింది.. దానితో కిడ్నీ లు పాడయ్యాయి.. ఇంకా మరికొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.. అనగానే కాస్త భయం వేసినా.. డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. బ్రతకడానికి 30 శాతం ఛాన్స్ మాత్రమే ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి 70 శాతం ఛాన్స్ ఉంది..అనగానే అంతా సూన్యంలా అనిపించింది అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు రానా.
ఇక జీవితంలో ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడమే కాదు.. ఉప్పులేని ఆహారం తినమని డాక్టర్స్ సజెస్ట్ చేసారు. ఆ టైం లో నా ఆరోగ్యం విషయంలో నాన్న ఆందోళన చూసి చాలా బాదేసింది అంటున్నారు రానా. ఇక అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుని ఇండియాకి తిరిగి వచ్చినట్టుగా చెప్పాడు రానా. అదంతా విన్న సమంత కన్నీళ్ళు పెట్టుకుంది.