తెలంగాణాలో థియేటర్స్ తెరుచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హీరోలంతా ఊపిరి పీల్చుకున్నారు. అంతేనా.. తెలంగాణ సీఎం కేసీఆర్ కి చిరు దగ్గరనుండి నాగార్జున, మహేష్ బాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, రాజమౌళి ఇలా సెలబ్రిటీస్ మొత్తం కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ థియేటర్స్ ఓపెనింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ వాళ్ళు కేసీఆర్ ని ఆకాశానికెత్తేశారు. అంతవరకూ బాగానే ఉంది. థియేటర్స్ తెరుచుకోవడం ఖాయమవడంతో.. ఇప్పుడు ఓటిటీల హవాకి బ్రేకులు పడ్డాయి. థియేటర్స్ ఓపెన్ అయ్యాయీగా అంటూ హీరోలెవరూ ఓటిటికి తమ సినిమాలు అమ్మెందుకు ముందుకు రావడం లేదు.
అయితే ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయినా సినిమాలను థియేటర్స్ లో విడుదల చెయ్యడానికి హీరోలు జంకుతున్నారు. సాయి ధరమ్ తేజ్, సుమంత్, వైష్ణవ తేజ్ లాంటి యంగ్ హీరోలు తమ సినిమాలు డిసెంబర్ లో థియేటర్స్ లో విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయినా.. ప్రస్తుతం కరోనా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అందులోని 50 శాతం ఆక్యుపెన్సీ. కాబట్టి సినిమాల రిలీజ్ డేట్ ఇవ్వాలంటే భయపడుతున్నారు. సుమంత్ కపటధారి డిసెంబర్ లో క్రిష్టమస్ కానుకగా అంటూ ఓ క్లారిటీ ఇచ్చాడు.
కానీ సాయి ధరమ్ మాత్రం సోలో బ్రతుకే సో బెటర్ కి ఇంకా డేట్ కి క్లారిటీ ఇవ్వడం లేదు. అలాగని ఓటీటీకి అమ్మలేదు.. థియేటర్స్ లోను సినిమాని రిలీజ్ చెయ్యాలంటే ధైర్యమూ చాలడం లేదు. మరి థియేటర్స్ ఓపెన్ అయిన సంతోషం ఎంతో కాలం మిగిలేలా లేదు అంటున్నారు. మరోపక్క మళ్ళీ లాక్ డౌన్ అంటూ సోషల్ మీడియాలో గాసిప్స్. దీనితో తమ సినిమాలని ఓటీటీకి అమ్మలేక.. థియేటర్స్ లో విడుదల చెయ్యలేక హీరోలు సతమతమవుతున్నారు.