Advertisementt

రెడ్డీస్ కోసం రోజా ర్యాంప్ వాక్!

Sat 28th Nov 2020 10:51 AM
mla roja,jabardast roja,ram walk,reddys multiplex movies banner  రెడ్డీస్ కోసం రోజా ర్యాంప్ వాక్!
Roja Ramp Walk In Reddy's Multiplex Movies Banner Launch రెడ్డీస్ కోసం రోజా ర్యాంప్ వాక్!
Advertisement
Ads by CJ

అటు రాజకీయాలతోను, ఇటు జబర్దస్త్ షో, బతుకు జట్క బండి షోస్ తోనూ రోజా బాగా బిజీ. రాజకీయాల్లో ప్రత్యర్దులకి మంచి నీళ్లు తాగించే రోజా జబర్దస్త్ షో లో గ్లామర్ డ్రెస్సులతో అదరగొడుతుంది. యాంకర్స్ అనసూయ, రశ్మిలకి పోటీ నిచ్చే డిజైనర్ వెర్ డ్రెస్సులతో రోజా అందాలు తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రాజకీయనాయకురాలంటే పద్దతిగానే ఉండాలా.. అనుకునేలా రోజా డ్రెస్సింగ్ స్టయిల్ ఉంటుంది. ఈమధ్యన అనసూయ, రష్మీలకి పోటీ ఇచ్చే డ్రెస్సులతో జబర్దస్త్ షోకి హాజరవుతున్న రోజా ఇప్పుడు రెడ్డీస్ కోసం రాంప్ వాక్ చేసింది. అంటే రోజా రెడ్డి కదా.. అందుకే రెడ్డీస్ కోసం ర్యాంప్ వాక్ చేసింది అనుకునేరు.

రోజా రెడ్డీస్ మల్టిప్లెక్స్ మూవీస్ బ్యానర్ లాంచ్ ఈవెంట్ లో సరదాగా లోగో ఉన్న టి షార్ట్ తో ర్యాంప్ వాక్ చేసి అక్కడ ఉన్న అతిధులని ఎంటర్టైన్ చేసింది. రోజా చక్కటి చీర కట్టులో నవ్వుతూ రెడ్డీస్ మల్టిప్లెక్స్ మూవీస్ బ్యానేర్ పబ్లసిటీ కోసం ర్యాంప్ వాక్ చెయ్యడం ఆమె అభిమానులకు విపరీతంగా నచ్చింది. మా రోజా ఏం చేసిన దానికి స్పెషల్ ఉంటుంది.. దానికి అందం వస్తుంది అంటూ రోజాని మూలగచెట్టు ఎక్కించేస్తున్నారు. మరి రోజా సరదాగా రెడ్డీస్ బ్యానేర్ కోసం చేసిన ర్యాంప్ వాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Roja Ramp Walk In Reddy's Multiplex Movies Banner Launch:

MLA Roja Ramp Walk In Reddy's Multiplex Movies Banner Launch Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ