Advertisementt

హీరోయిన్ ఎంపికలో తప్పు చేసిన డైరెక్టర్!

Thu 26th Nov 2020 08:29 PM
director ashok,bhumi pednekar,durgamati movie,anushka  హీరోయిన్ ఎంపికలో తప్పు చేసిన డైరెక్టర్!
This heroine is not suitable for this movie.. హీరోయిన్ ఎంపికలో తప్పు చేసిన డైరెక్టర్!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో ఇప్పుడు తెలుగు సినిమాల రీమేక్ ల పర్వం నడుస్తుంది. సల్మాన్ ఖాన్ అయితే తెలుగులో బ్లాక్ బస్టర్ సినిమాలను రీమేక్ చేసి కోట్లు కొల్లగొట్టాడు. ఈమధ్యన అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ ని సందీప్ వంగ యాజిటీజ్ గా రీమేక్ చేసి బ్లాక్బాస్టర్ కొట్టాడు. అలాగే షాహిద్ కపూర్ హీరోగా జెర్సీ రీమేక్ చేస్తున్నాడు గౌతమ్ తిన్నసూరి. ఇక తెలుగులో యువీ క్రియేషన్స్ లో అశోక్‌ దర్శకత్వంలో అనుష్క మెయిన్ లీడ్ లో తెరకెక్కిన భాగమతి సినిమాని బాలీవుడ్ లో దుర్గామతిగా రీమేక్ చేస్తున్నాడు. భాగమతి దర్శకుడు అశోకే బాలీవుడ్ దుర్గామతి దర్శకుడుగా పని చేస్తున్నాడు.

అయితే తెలుగులో అనుష్క మెయిన్ లీడ్లో తెరకెక్కిన భాగమతి బాలీవుడ్ రీమేక్ లో అనుష్క ప్లేస్ లో భూమి పెడ్నేకర్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు దర్శకుడు. ఇక భాగమతి సినిమాని యాజిటీజ్ గా రీమేక్ చేసేసాడు అశోక్. ఆ విషయం తాజాగా విడుదలైన దుర్గామతి ట్రైలర్ లోనే అర్ధమవుతుంది. ఒరిజినల్ భాగమతి లో అనుష్క హావభావాలు, ఆమె నటన, ఆమె ఆహార్యం, హుందాతనం అన్ని సూపర్ అనేలా ఉన్నాయి. కానీ బాలీవుడ్ భాగమతిలో హీరోయిన్ ఎంపికలో దర్శకుడు అశోక్ తప్పు చేసాడనిపిస్తుంది. దుర్గామతి ట్రైలర్ చూస్తే భాగమతి కాపీ అన్నట్టుగా ఉన్నప్పటికీ.. అనుష్క రోల్ లో నటించిన భూమి పెడ్నేకర్ మాత్రం తేలిపోయింది. చెంచల, భాగమతి పాత్రలో అనుష్క సూపర్బ్ అనిపిస్తే.. బాలీవుడ్ లో భూమి మాత్రం కామెడీ అయ్యింది.

అసలు భూమి ని దుర్గామతి కేరెక్టర్ కి తీసుకోవడమే పెద్ద మిస్టేక్ అనేలా ఉంది. ఆమె దుర్గామతి పాత్రకి సెట్ అవలేదనిపిస్తుంది.. అనుష్క ని భాగమతిగా  చూసాక భూమి పెడ్నేకర్ ని దుర్గామతి చూడాలంటే ఎంత కష్టమో దుర్గామతి ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. ఇక మాతృకకి హిందీ వెర్షన్ కి అసలు తేడా లేదు. కాకపోతే అశోక్ దుర్గామతి సెట్టింగ్స్ లో కొత్తదనం చూపించడం తప్ప. అందులో అశోక్ కొత్తగా చేసిందేమి లేదు. 

This heroine is not suitable for this movie..:

Ashok - Bhumi Pednekar Durgamati Movie trailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ