Advertisementt

విమర్శకులకు చెక్ పెట్టిన ప్రభాస్!!

Thu 26th Nov 2020 05:37 PM
prabhas,weight loss,new look,radhe shyam,adipurush  విమర్శకులకు చెక్ పెట్టిన ప్రభాస్!!
Prabhas Lean look goes viral విమర్శకులకు చెక్ పెట్టిన ప్రభాస్!!
Advertisement
Ads by CJ

ప్రభాస్ బాహుబలి సినిమా కోసం బాహుబలి పాత్ర కోసం బాగా బరువు పెరిగాడు. ఆ పాత్ర వెయిట్ అలాంటిది. కాబట్టే ప్రభాస్ వెయిట్ పెరిగాడు. అంతకుముందు మిర్చి సినిమాలో సూపర్ స్టయిలిష్ గా ఉండే ప్రభాస్ బాహుబలి పాత్రకి బరువు పెరిగి సూపర్ పర్ఫెక్ట్ అనిపించాడు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్స్ విషయంలో, బరువు విషయంలో చాలా విమర్శలు ఎదుర్కున్నాడు. బాగా బరువు పెరిగిన ప్రభాస్.. తర్వాత ఎంతగా జిమ్ చేసి, వర్కౌట్ చేసి, సాహసాలు చేసినా బరువు తగ్గలేదు. సరికదా లుక్స్ విషయంలోనూ ఏజెడ్ పర్సన్ లా తయారయ్యాడు. సాహో లో ప్రభాస్ లుక్స్ కి కుడా మైనస్ మార్కులు పడ్డాయి. ఇక రాధేశ్యాం విషయంలో ప్రభాస్ లుక్స్ కాస్త ఏజెడ్ లుక్స్ ని తలపించడంతో ఆయన ఫాన్స్ కూడా కంగారు పడ్డారు.

కానీ ఇప్పుడు విమర్శకులకు, ఫాన్స్ కి కలిపి ఒకేసారి సమాధానం ఇచ్చాడు. ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ కోసం సూపర్ మేకోవర్ అవుతున్నాడు. ఇప్పటికే జిమ్ చేస్తున్న ప్రభాస్ బరువు తగ్గి కొత్తగా కనిపిస్తున్నాడు. ప్రభాస్ తాజా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవడం కాదు.. విమర్శకుల నోళ్లు మూతపడేలా ఉంది. మిర్చి సినిమాలో ప్రభాస్ ఎలా ఉన్నాడో.. ప్రభాస్ తాజా లుక్ లో అలా అంత స్టైలిష్ గా ఉన్నాడు. సన్నగా స్టైలిష్ గా, కూల్ గా కనబడుతున్న ప్రభాస్ ని చూస్తే ఆదిపురుష్ కోసం ఎంతగా హోమ్ వర్క్ చేసాడో అనిపిస్తుంది. చక్కటి లుక్స్ తో, సరిపడా బరువుతో.. కొత్త లుక్ తో ఉన్న ప్రభాస్ ని చూస్తే ఫాన్స్ కి ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది.

Prabhas Lean look goes viral:

Prabhas New look goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ