మెగా ఫ్యామిలి కాంట్రవర్సీ కింగ్ ఎవరు అంటే నాగబాబు పేరే చెబుతారు. పవన్ విషయమైనా, ఫ్యామిలీ విషయమైనా, సామజిక అంశమైనా ఏదైనా ఓపెన్ గా మాట్లాడి చిక్కుల్లో పడుతుంటాడు. అయితే ఎప్పుడూ దుందుడుకుడు తనంతో ఉండే నాగబాబు ఇప్పుడు తన తప్పు ఒప్పుకుంటున్నాడు. అంటే మన ఛానల్ మన ఇష్టం అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి.. దాని ద్వారా అనేక విషయాలను పంచుకుంటున్న నాగబాబు తాజాగా పిల్లల పెంపకం విషయం గురించి మట్లాడుతూ.. నేను గొప్ప కమ్యూనికేటర్ కాకపోవచ్చు కానీ.. ఎంతో కొంత బెటర్. నా పిల్లలైనా వరుణ్ , నిహారికలకు చాలా విషయాలను విడమరిచి చెప్పేవాడిని. చిన్నప్పుడు పిల్లలు తప్పు చేస్తే సర్ది చెప్పాలి, కానీ కొట్టకూడదు. నేను ఒకటి రెండుసార్లు నిహారిక, వరుణ్ లని కొట్టాను.
కానీ అది చాలా తప్పు. అప్పటికి నాకు మెచ్యూరిటీ లేదు. అందుకే ఆలా ప్రవర్తించేవాడిని. కానీ పిల్లల్ని కొట్టకూడదు. అది నేను చేసిన తప్పు. పిల్లలతో పేరెంట్స్ ఫ్రీగా మాట్లాడాలి, అలాగే పిల్లలు కూడా పేరెంట్స్ దగ్గర భయపడకుండా అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. అందుకే నేను వరుణ్ , నిహారికలతో ఒక్కటే చెప్పాను. మీకు ఏ సమస్య వచ్చినా నాతో చెప్పండి. అది చిన్నదైనా, పెద్దదైనా, చెప్పుకోలేని సమస్యైనా నాకు చెబితే నేను సాల్వ్ చేస్తా అని. ఎందుకంటే మీకు నాకంటే విలువైన వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉండరని చెప్పాను.. నా పిల్లలతో స్వేచ్ఛగా ఉండడం, వాళ్ళు నా దగ్గర ఫ్రీగా ఉండడంతో మా మధ్యన ఎలాంటి దాపరికాలు లేవని చెబుతున్నాడు నాగబాబు.