ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ ని ఏ హీరో అందుకునేలా కనిపించడం లేదు. టాలీవుడ్ హీరోల్లో ప్రభాస్ రేంజ్ అందుకోవడనికి చాలా టైం పడుతుంది కానీ.. ఇప్పుడు బాలీవుడ్ హీరోలు కూడా ప్రభాస్ రేంజ్ ని అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఒక్క బాహుబలి.. ఒకే ఒక్క బాహుబలి ప్రభాస్ రేంజ్ ని పెంచేసింది. బాహుబలిలో ప్రభాస్ ని చూసాక అందరూ ప్రభాస్ తో సినిమా చెయ్యాలి.. కోట్లు కొల్లగొట్టాలనే దర్శకనిర్మాతలే. అందులో బాలీవుడ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. తాజాగా ప్రభాస్ మీద పెడుతున్న పెట్టుబడి చూస్తే అమ్మో ప్రభాస్ రేంజ్ ఇంతా అని షాకవ్వాల్సిందే. సల్మాన్ ఖాన్, రజినీకాంత్, అమీర్ ఖాన్ ల సినిమాలకు ఇంత బడ్జెట్ పెట్టరేమో అనుకోవాల్సిందే.
ప్రభాస్ తో రాధేశ్యాం చేస్తున్న యూవీ క్రియేషన్స్ వారు 250 కోట్ల భారీ బడ్జెట్ పెడుతుంటే... ఓం రౌత్ - టి సీరీస్ వాళ్ళు.. ఆదిపురుష్ కోసం అక్షరాలా 450 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. బాహుబలి రేంజ్ ప్రభాస్ ముందు ఎంత అయినా తక్కువే అన్నట్టుగా ఉన్నారు టి సీరీస్ నిర్మాతలు. ఇక నాగ్ అశ్విన్ - అశ్విని దత్ లు ప్రభాస్ తో తెరకెక్కించబోయే పిరియాడికల్ మూవీ కోసం 350 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లుగా టాక్. అంటే ప్రభాస్ మీద ముగ్గురు నిర్మాతలు మూడు సినిమాల కోసం 1000 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు అంటే.. ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్ లో ఉందొ తెలుస్తుంది. మరి ప్రభాస్ సినిమా బడ్జెట్ ని, ఆయన రేంజ్ ని అందుకోవడానికి బాలీవుడ్ హీరోలు బాగా కష్టపడాల్సి వచ్చేలా ఉంది.