రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కుతున్న RRR చిత్రంపై ఇండియా వైడ్ గా బోలెడన్ని అంచనాలున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ RRR వీడియోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసాయి. కరోనా తో ఆగిన షూటింగ్ రీసెంట్ గా మొదలైనప్పటినుండి గ్యాప్ లేకుండా రాజమౌళి RRR షూటింగ్ చిత్రీకరణ జరుపుతున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కొమరం బీమ్, అల్లూరి పాత్రల్లో రాజమౌళికి సహకరిస్తుండంతో.. RRR షూటింగ్ ఫిబ్రవరి చివరికల్లా పూర్తవుతుందని టాక్. అయితే ఇప్పుడీ సినిమా పాన్ ఇండియా లెవల్లో అనేక భాషల్లో విడుదలకాబోతుంది.
అందుకే ఆయా భాషల టాప్ సెలబ్రిటీస్ తో RRR వాయిస్ ఓవర్ చెప్పించాడనికి రాజమౌళి ప్లాన్ చేసుకున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రల ఇంట్రడక్షన్ సీన్ ని పరిచయం చేసే వాయిస్ ఓవర్ కోసం తెలుగులో RRR కి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తుండగా.. బాలీవుడ్లో RRR కి అమీర్ ఖాన్ వాయిస్ ఇవ్వబోతున్నాడట. మరి రెండు భాషల్లో ఇద్దరు లెజెండ్స్ వాయిస్ ఓవర్ అంటే సినిమాపై పిచ్చ క్రేజ్ ఉంటుంది. ఇక మిగతా భాషల వాయిస్ ఓవర్ కి కూడా ఆయా భాషల టాప్ నటులతోనే రాజమౌళి వాయిస్ ఓవర్ చెప్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడట. ఇక చిరు ఆచార్య షూటింగ్ లో బిజీగా ఉంటే.. అమీర్ ఖాన్ మహాభారత్ సినిమా షూటింగ్ తో హైద్రాబాద్ లోని రామోజీఫిలిం సిటీలో బిజీగా ఉన్నాడు.