ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు.. స్టైలిష్ హీరో అరవింద్ స్వామి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోను విలన్ గాను, హీరోగానూ ఇరగదీస్తున్నాడు. టాలీవుడ్ కి రామ్ చరణ్ ధ్రువ సినిమాతో అరవింద్ స్వామి స్టైలిష్ విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ధ్రువ సినిమాలో రామ్ చరణ్ కేరెక్టర్ కి, ఆయన నటనకు ఎంతగా పేరొచ్చిందో.. విలన్ కేరెక్టర్ అరవింద్ స్వామికి అంతే పేరు వచ్చింది. స్టైలిష్ లుక్స్, స్టైలిష్ మ్యానరిజంతోనే విలనిజాన్ని పండించిన అరవింద్ స్వామి, తర్వాత మళ్ళీ తెలుగు సినిమాల వైపు చూడకపోయినా సెకండ్ ఇన్నింగ్స్ లో తమిళనాట ఫుల్ బిజీ. తెలుగు భాష రాదు కాబట్టి హావభావాలను పలికించడం కష్టం అందుకే తెలుగు ఆఫర్స్ వద్దనుకున్న అరవింద్ స్వామి ఇప్పుడు చిరు కి విలన్ గా మారబోతున్నాడట. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో అరవింద్ స్వామి విలన్ పాత్రలో కనిపించబోతున్నాడనే టాక్ ఉంది.
అయితే అది నిజమంటున్నారు. ఆచార్య కి విలన్ అరవింద్ స్వామీ అని.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ సినిమాలో కొరటాల, అరవింద్ స్వామికిని స్టైలిష్ విలన్ గా చూపించబోతున్నాడా.. లేదంటే రఫ్ విలన్ గా చూపించబోతున్నాడా.. అనే విషయంలో మెగా ఫాన్స్ క్యూరియాసిటీతో ఉన్నారు. కొరటాల అంటేనే క్లాస్.. మరి మాస్ గా అరవింద్ స్వామిని మారుస్తాడా.. లేదా స్టైలిష్ లుక్స్ తోనే అరవింద్ కేరెక్టర్ కి విలనిజాన్ని రాశాడా.. అంటున్నారు. మొత్తానికి ఆచార్య విలన్ అరవింద్ స్వామి అని ఫిక్స్ అవడమే కాదు... త్వరలోనే చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇస్తుంది అంటున్నారు ఫాన్స్.