చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న శృతి హాసన్ మళ్ళీ సినిమాలతో బిజీ తారగా మారింది. క్రాక్ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గాను, వకీల్ సాబ్ లో పవన్ భార్య పాత్రలోనూ నటిస్తూ శృతి హసన్ బిజీగా ఉండడమే కాదు.. తమిళ సినిమాలతోను శృతి ఫుల్ బిజీ. తమిళనాట విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న `లాభం` సినెమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే శృతి హాసన్ లాభం సెట్స్ నుండి అర్ధాంతరంగా వెళ్లిపోయిన న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అయ్యింది. ఎస్ పి జననాథన్ దర్శకత్వంలో లాభం సినిమా షూటింగ్ క్లైమాక్స్ ధర్మపురి, క్రిష్ణగిరి ప్రాంతాల్లో ప్లాన్ చేసుకున్నారట. అయితే అక్కడ సినిమా షూటింగ్ జరుగుతుంది అనగానే సినిమా అభిమానులు పెద్ద ఎత్తున లాభం సెట్స్ చుట్టూ గుమ్మి గుడారట.
హీరో విజయ్ సేతుపతి, శృతి హాసన్ ని చూసేందుకు పెద్ద ఎత్తున జనం పొగవడంతో.. హీరోయిన్ శృతి హాసన్ లాభం సెట్స్ నుండి అర్ధాంతరంగా వెళ్లిపోయిందట. మరి కరోనా టైములో హీరో, హీరోయిన్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తమ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం సినిమా షూటింగ్స్ హడవిడిగా ఉంది. షూటింగ్ దగ్గర ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో అంత పెద్దగా జనాలు గుమ్మి గూడడం మంచిది కాదని భావించిన శృతి హాసన్ షూటింగ్ కి పేకప్ చెప్పేసి వేంటనే అక్కడ నుండి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది.