Advertisementt

డిసెంబర్ వచ్చేస్తుంది.. హడావిడే లేదు..!!

Tue 24th Nov 2020 05:15 PM
young heroes,december releases,solo bratuke so betar,30 rjullo preminchadam ela,uppena  డిసెంబర్ వచ్చేస్తుంది.. హడావిడే లేదు..!!
No promotions to December release films డిసెంబర్ వచ్చేస్తుంది.. హడావిడే లేదు..!!
Advertisement
Ads by CJ

కరోనాతో థియేటర్స్ అన్ని వెలవెలబోతున్నాయి. కరోనా ని కేర్ చేయకుండా థియేటర్స్ ఓపెన్ చేసినా... థియేటర్స్ వంక చూసే నాథుడే లేడు. 50 పర్సెంట్ అక్యుపెన్సీకే ఎవరూ రాకపోతే 100 శాతం తో థియేటర్స్ ఓపెన్ చేస్తే ఎవరొస్తారు. మరి డిసెంబర్ కయినా పరిస్థితి మెరుగుపడుతుంది. థియేటర్స్ లో సినిమాలు విడుదల చేస్తామని చెబుతున్న హీరోల హడావిడి డిసెంబర్ దగ్గరకొచ్చేసినా కనిపించడం లేదు. సాయి ధరమ్ తేజ్ డేర్ గా డిసెంబర్లో సోలో బ్రతుకే సో బెటరు అంటూ ప్రకటించాడు. ఇక ఉప్పెన కూడా ఎప్పుడెప్పుడు అన్నట్టుగా ఉంది.

మరోపక్క ప్రదీప్ మాచిరాజు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా. ఇవన్నీ థియేటర్స్ ఓపెనింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న సినిమాలు. థియేటర్స్ ఓపెన్ అవగానే ఈ మూడు వరసకట్టేస్తాయి. అది డిసెంబర్ అనుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు క్లారిటీ లేదు. డిసెంబర్ రావడానికి మరో వారం మాత్రమే టైం ఉంది. కానీ ఒక్క హీరో హడావిడి మొదలు కాలేదు. కనీసం ప్రమోషన్స్ మొదలు పెట్టినా.. థియేటర్స్ ఓపెన్ అవగానే డేట్ ఇచ్చెయ్యొచ్చు. కానీ సాయి ధరమ్ కూడా ముందుకు రావడం లేదు. ప్రదీప్ ఏమైపోయాడో తెలియదు. ఉప్పెన మాత్రం సోషల్ మీడియాలో హడావిడి స్టార్ట్ చేసింది. మిగతావాళ్లే ఏం మాట్లాడడం లేదు.

No promotions to December release films:

Young Heroes films ready to Release in December

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ