Advertisementt

ఎన్టీఆర్‌కి బాలీవుడ్డా?.. శాండిల్‌వుడ్డా?

Tue 24th Nov 2020 12:44 PM
ntr - trivikram combo,ntr,kiara advani,rashmika  ఎన్టీఆర్‌కి బాలీవుడ్డా?.. శాండిల్‌వుడ్డా?
NTR wants Rashmika.. but Trivikram eye on Kiara Advani ఎన్టీఆర్‌కి బాలీవుడ్డా?.. శాండిల్‌వుడ్డా?
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ RRR షూటింగ్ ఎంత త్వరగా ఫినిష్ చేస్తే అంత త్వరగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నాడు. ఎన్టీఆర్ కోసం గ్రౌండ్ వర్క్ చేసుకుని వెయిట్ చేస్తున్న త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్ కి జోడి వేటలో ఉన్నాడట. ముందు నుండి పూజ హెగ్డే, తర్వాత రష్మిక పేరు గట్టిగా వినిపించినా.. ఎన్టీఆర్ పూజ హెగ్డే ని వెంటనే రిపీట్ చెయ్యడమెందుకు అన్నాడని త్రివిక్రమ్ చూపు రష్మిక మీద పడింది అన్నారు. కానీ మధ్యలో మహానటి కీర్తి సురేష్ ఎన్టీఆర్ జోడిగా నటించబోతుంది అన్నారు.

తాజాగా ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ బాలీవుడ్ భామ ని సంప్రదిస్తున్నాడని.. అది కూడా బాలీవుడ్లో బిజీ అయినా కియారా అద్వానీ మీదే త్రివిక్రమ్ చూపు ఉందని అంటున్నారు. ఇక కియారా గనక డేట్స్ ప్రాబ్లెమ్ అంటే గనక త్రివిక్రమ్ కన్నడ పిల్ల రష్మిక మందాన్నని కి ఫిక్స్ చేసేలా ఉన్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తుంది. కియారా మాత్రం ఎన్టీఆర్ పేరు చెబితే కాదనదని.. కానీ కరోనా, డేట్స్ ఇలాంటి ప్రోబ్లెంస్ ఉంటే గనక చివరికి రష్మిక నే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం ఫైనల్ చేస్తాడంటుంటే.. ఆమేమో పుష్ప మరియు శర్వానంద్ ఆడాళ్ళు మీకు జోహార్లతో పాటుగా అఖిల్ -సురేందర్ రెడ్డి మూవీలోను హీరోయిన్ గా ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి.. ఎన్టీఆర్ కొచ్చేసరికి రష్మిక డేట్స్ పరిస్థితి ఏమిటో అంటున్నారు. చూద్దాం ఫైనల్ గా ఎన్టీఆర్ కి బాలీవుడ్ లేదా శాండిల్ వుడ్ హీరోయిన్ ఫిక్స్ అవుతుందా అనేది.

NTR wants Rashmika.. but Trivikram eye on Kiara Advani:

Who is heroine in Jr NTR and Trivikram Film?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ