Advertisementt

పవన్ సరసన ఇస్మార్ట్ పోరి?

Mon 23rd Nov 2020 03:02 PM
nidhi agarwal,pawan kalyan,pspk 27,krish  పవన్ సరసన ఇస్మార్ట్ పోరి?
Pawan to Romance Nidhi Agarwal in PSPK 27 పవన్ సరసన ఇస్మార్ట్ పోరి?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ జాడ కానీ, వకీల్ సాబ్ సినిమా విడుదల తేదీ జాడ కానీ కనిపించడం లేదు. ఒకవేళ రిలీజ్ డేట్ ఇచ్చేవాళ్లే అయితే.. ఈపాటికి వకీల్ సాబ్ టీజర్ హడావిడి ఉండేది. కానీ వకీల్ సాబ్ షూటింగ్ ఎప్పుడు అవుతుందో అనేది దర్శకనిర్మాతలకు క్లారిటీ ఉన్నట్టుగా లేదు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో బిజెపికి మద్దతు పలికింది. అంటే మరో వారం పటు ఈ ఎన్నికల హడావిడిలో పవన్ ఉండడం, తర్వాత నిహారిక పెళ్ళికి రాజస్థాన్ వెళ్లొచ్చాక, వకీల్ సాబ్ షూటింగ్ కూడా ఫినిష అయ్యాక పవన్, క్రిష్ సినిమా కోసం రెడీ అవుతాడు.

అయితే క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది అనే టాక్ వుంది. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబో మూవీ కోసం ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్ ని చిత్ర బృందం సంప్రదించినట్టుగా.. పవన్ సరసన అవకాశం అనగానే నిధి మరు మాట్లాడకుండా క్రిష్ కి ఓకె చెప్పినట్టుగా ప్రచారం షురూ అయ్యింది. అంటే పవన్ కళ్యాణ్ సినిమాలో నిధి హీరోయిన్ గా దాదాపుగా ఫిక్స్ అంటున్నారు. ఇక పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న పవన్ - క్రిష్ సినిమా డిసెంబర్ రెండో వారం నుండి సెట్స్ మీదకెళుతుందని.. అందుకే ఈ లోపు హీరోయిన్ ని క్రిష్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడని అంటున్నారు.

Pawan to Romance Nidhi Agarwal in PSPK 27:

Nidhi Agarwal pair up with Pawan Kalyan in PSPK 27

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ