Advertisementt

ముందు చిరునా? లేదా అఖిల్ తోనా?

Sun 22nd Nov 2020 10:28 AM
chiranjeevi,lucifer remake,mohan raja,akhil  ముందు చిరునా? లేదా అఖిల్ తోనా?
Mohan Raja first choice Chiru or Akhil ముందు చిరునా? లేదా అఖిల్ తోనా?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో ఇప్పుడు చిరు లూసిఫర్ రీమేక్ హాట్ టాపిక్ గా మారింది. మలయాళ లూసిఫర్ ని తెలుగులో రీమేక్ చెయ్యబోతున్న చిరుకి ఆ రీమేక్ ని పక్కాగా తెరకెక్కించే డైరెక్టర్ కనిపించడం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ముందు సాహో డైరెక్టర్ సుజిత్ ని అనుకుని తర్వాత ఆ రీమేక్ నుండి ఆయన్ని తప్పించి వినాయక్ ని రంగంలోకి దించితే.. వినాయక్ కూడా చిరు ని మెప్పించేలేక చేతులెత్తేశాడు. దానితో తమిళ సూపర్ హిట్ డైరెక్టర్ మోహన్ రాజా ఇప్పడు లూసిఫర్ రీమేక్ దర్శకుల లిస్ట్ లోకి చేరడమే కాదు... లూసిఫర్ రీమేక్ స్క్రిప్ట్ పనులను కూడా స్టార్ట్ చేసాడట. లూసిఫర్ స్క్రిప్ట్ తో చిరుని శాటిస్ఫాయ్ చేస్తే మోహన్ రాజన్ లూసిఫర్ దర్శకుడిగా ఫిక్స్ అవుతాడు.

అయితే మోహన్ రాజా టాలీవుడ్ హీరోలైన రామ్ చరణ్, అఖిల్ తో సినిమాలు చేసేందుకు వస్తే చరణ్ ఏమో చిరు ని తగిలించాడు. అయితే మోహన్ రాజాకి అఖిల్ తో సినిమా కూడా కన్ఫర్మ్ అయ్యేలా ఉందట. ఇప్పటికే మోహన్ రాజా అఖిల్ తో కథా చర్చలు జరిపినట్టుగా టాక్ ఉంది. అయితే అఖిల్ తో కూడా మూవీ సెట్ అయితే.. మోహన్ రాజా చిరుతో ఫస్ట్ మొదలు పెడతాడా? లేదంటే అఖిల్ తోనా అనేది క్లారిటీ రావాలి. మరి చిరుకి ఆచార్య ఫినిష్ అవ్వగానే వేదలమ్ రీమేక్ పూర్తి చెయ్యాలి. మరోపక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూటింగ్ ఫినిష్ చేస్తున్న అఖిల్ సురేందర్ రెడ్డితో సినిమా చెయ్యాలి. మరి చిరు - అఖిల్ ఒకేసారి మోహన్ రాజా ఫిలిం కోసం రేడి అయితే మోహన్ రాజా ఎవరితో ముందు సినిమా చేస్తాడనేది ప్రస్తుతం సస్పెన్స్.

Mohan Raja first choice Chiru or Akhil:

Chiru or Akhil first for Director Mohan Raja?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ