Advertisementt

స్టార్ హీరోలిద్దరికి విలన్స్ ప్రోబ్లెంస్!!

Mon 23rd Nov 2020 12:18 PM
mahesh babu,sarkaru vaari paata,allu arjun,pushpa,sukumar,parasuram,villains  స్టార్ హీరోలిద్దరికి విలన్స్ ప్రోబ్లెంస్!!
Villain Problems to Mahesh and Allu Arjun స్టార్ హీరోలిద్దరికి విలన్స్ ప్రోబ్లెంస్!!
Advertisement
Ads by CJ

కరోనా టైం పూర్తయ్యింది.. అయినా కాకపోయినా.... యధావిధిగా స్టార్స్ మొత్తం షూటింగ్స్ కోసం పరుగులు పెడుతున్నారు. కరోనాకి ముందు ఆరామ్స్ గా షూటింగ్ చేసుకునే నటులు కరోనా తర్వాత ఉరుకులు పరుగులు మీద షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని ఇప్పుడు సెట్స్ మీదున్నాయి. అందులో అల్లు అర్జున్ పుష్ప, రాజమౌళి RRR, మహేష్ సర్కారు వారి పాట, ప్రభాస్ రాధేశ్యాం, చిరు ఆచార్య ఇలా అందరూ సినిమా షూటింగ్స్ తో బిజీ అవుతున్నారు. అయితే రాజమౌళి RRR ని పక్కా ప్రణాళికలతో సెట్స్ మీదకి తీసుకెళ్లాడు రాజమౌళి. కానీ సుకుమార్, పరశురామ్ లు సినిమా షూటింగ్ మొదలవుతున్నా పక్కా ప్రణాళిక లేదనిపిస్తుంది. ఎందుకంటే సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాకి ఇంకా విలన్ దొరకలేదు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వేటాడినా పుష్పరాజ్ కి విలన్ కరువయ్యాడు.

ఇక మరో స్టార్ హీరో మహేష్ బాబు - పరశురామ్ కాంబోలో తెరకెక్కాల్సిన సర్కారు వారి పాట సినిమా పూజ కూడా పూర్తయ్యింది. మరోనెలలో టీం మొత్తం షూటింగ్ తో బిజీ అవుతుంది. కానీ ఇంతవరకు మహేష్ కి మొగుడు అదేనండి విలన్ సెట్ అవలేదు. అటు అల్లు అర్జున్ కి విజయ్ సేతుపతి హ్యాండ్ ఇచ్చాడు. దానితో సుకుమార్ కి పుష్ప కోసం ఇప్పటివరకు విలన్ దొరకలేదు. మధ్యలో మాధవన్, ఇంకొంతమంది పేర్లు వినిపించినా.. మాధవన్ నేను పుష్ప లో నటించడం లేదనేసాడు. ఇక మహేష్ కోసం ఉపేంద్ర, అరవింద్ స్వామి పేర్లు వినిపించినా.. క్లారిటీ లేదు. మరి ఈ స్టార్స్ ఇద్దరూ తమ సినిమా షూటింగ్స్ మొదలవుతున్నా విలన్ విషయంలో ఇంకా ప్రోబ్లెంస్ లోనే ఉన్నారన్నమాట.

Villain Problems to Mahesh and Allu Arjun:

These Two Star Heroes Facing Villain Problems

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ