మహేష్ -పరశురామ్ కాంబోలో తెరకెక్కబోతున్న సర్కారు వారి పాట సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. పూజ కార్యక్రమాలతో మొదలైన సర్కారు వారి పాట సినిమా జనవరి మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. డిసెంబర్ చివరి వారంలో సర్కారు వారి పాట టీం మొత్తం అమెరికా ఫ్లైట్ ఎక్కబోతుంది. అయితే ఈ సినిమా లో మహేష్ బాబు సరసన మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది. మహేష్ తో నటించడానికి కీర్తి సురేష్ బాగా ఎగ్జైటింగ్ గా ఉంది. అయితే మహేష్ ఫాన్స్ సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ హీరోయిన్ అంటే కాస్త ఇబ్బంది పడుతున్నారు. మహేష్ పక్కన కీర్తి తేలిపోతుంది అని... కీర్తి లేటెస్ట్ ఫోటో షూట్స్ చూస్తుంటే మహేష్ పక్కన ఆనదని ఫీలవుతున్నారు.
అయితే తాజాగా మహేష్ సర్కారు వారి పాటలో మరో హీరోయిన్ కూడా ఉంటుంది అని... అయితే ఇంకా ఆ హీరోయిన్ ని చిత్ర బృందం ఫైనల్ చెయ్యలేదని తెలుస్తుంది. సర్కారు వారి పాట షూటింగ్ మొదలు పెట్టి సెట్స్ మీదకెళ్లాక సెకండ్ హీరోయిన్స్ ఆడిషన్స్ సంగతి చూద్దామని పరశురామ్ సర్కారు టీం కి చెప్పాడట. ఎందుకంటే సర్కారు వారి పాటలో సెకండ్ హీరోయిన్ కూడా కీలకం అని.. కాకపోతే ఆమెకి కాస్త స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి.. స్టార్ హీరోయిన్స్ ఎవరూ ఒప్పుకోకపోవచ్చని, కాబట్టి కాస్త పేరున్న హీరోయిన్ ని సర్కారు వారి పాట కి సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేసుకోవచ్చని ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.